Begin typing your search above and press return to search.

జాకమ్మ అందాలు.. గుండెల్లో స్తోత్రాలు..

By:  Tupaki Desk   |   26 Nov 2015 9:17 AM GMT
జాకమ్మ అందాలు.. గుండెల్లో స్తోత్రాలు..
X
జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. సల్లూభాయ్ నోటికి తన డ్రస్ అంచు ఇచ్చేసినప్పటి నుంచి.. ఈ భామ కుర్రకారు గుండెల్లో పాతుకుపోయింది. గ్లామర్ విషయంలో మొహమాటం లేకపోవడం, దేనికైనా రెడీ అన్నట్లుండే వాలకం.. జాక్వెలిన్ కి డిమాండ్ అమాంతం పెంచేశాయి. అయితే.. మళ్లీ ఆ రేంజ్ ఆఫర్ మాత్రం రాలేదనే చెప్పాలి. దీంతో రూటు మార్చి హాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేందుకు కూడా సిద్ధమైపోయంది లెండి.

ఇప్పుడు డిసెంబర్ ఫిలింఫేర్ మేగజైన్ కవర్ పేజ్ ఎక్కేసింది. ఇందుకోసం ఇచ్చిన ఫోజులు చూస్తే.. కుర్రాళ్లేంటి ముసలాళ్లయినా మైమరిచిపోవాల్సిందే. ఓన్లీ బ్లాక్ టాప్ తో కవర్ పేజ్ మీద ఫోటో చూస్తే.. ఎందుకీ భామకి ఇంత క్రేజ్ ఏర్పడిందనే సంగతి అర్థమయిపోతుంది. ఇక లోపలి పేజీల్లో అయితే తన లోపలి అందాలను మరింతగా పరిచేసిందీ సుందరాంగి. తన రెగ్యులర్ యాక్టివిటీ ఎలా ఉందో చెబ్తూనే.. తన సరదాలు సంతోషాలు ఔటింగులపైనా డీటైల్స్ ఇచ్చేసింది. మరోవైపు వైట్ డ్రస్ తో ఒకటి, రెడ్ టాప్ తో మరొకటి స్టిల్స్ ఇచ్చింది చూడండి. బోటు మీద ఎక్కడో ఉంది కానీ.. అదే డ్రస్ తో ఇంకెక్కడయినా షూట్ చేసుంటే మాత్రం.. వెనకబడే వాళ్లని లెక్కట్టడానికి వారం పట్టేది. అంతలా రెచ్చగొట్టేసింది జాక్వెలిన్.

ఇక మూవీస్ విషయానికొస్తే రీసెంట్ గా బ్రదర్ మూవీలో అక్షయ్ కుమార్ భార్యగా నటించగా.. బోలెడన్ని ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి. లీడ్ హీరోయిన్ నుంచి స్పెషల్ రోల్ వరకూ అన్నీ చేసేస్తుండడంతో.. ఆఫర్స్ కుప్పలు తెప్పలుగానే వస్తున్నాయి. చంద్రన్ రౌతమ్ తీస్తున్న ఇంగ్లీష్ శ్రీలంకన్ క్రైమ్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తయిపోయింది. ఇక హాలీవుడ్ లోనూ ఓ హారర్ థ్రిల్లర్ తో ఎంట్రీ ఇచ్చేస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.