ఫోటో: నెలవంక తొంగి చూసింది!

Tue Sep 18 2018 21:25:41 GMT+0530 (IST)

అసలు మనం అనేవాళ్లం ఒకరం ఉన్నామని లోకానికి తెలిసేదెలా? ఏదో ఒక కుప్పిగంతు వేయాలి. అల్లరిచిల్లర వేషంతో రంజింపజేయాలి. లేదూ రోమాంచితంగా ఏదైనా అథ్లెటిక్ మూవ్‌మెంట్‌ని అయినా చూపించాలి. ఇలాంటి వేషాలు వేయడంలో ఎవరు రాణిస్తే వాళ్లే స్టార్లు సూపర్‌స్టార్లు. ఈ కొత్త డెఫినిషన్ కాస్త డీప్‌గా స్టడీ చేయాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఏదో ఒక కొత్త వేషం వేయడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ పెంచుకోవడం చూస్తున్నదే. కోట్లాది మంది ఫాలోవర్స్ అదే పనిగా కథానాయికల ఫోటోలు - వీడియోలు - లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం చకోర పక్షుల్లా ట్విట్టర్ - ఇన్‌స్టాగ్రమ్‌లను అనుసరిస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ అందాల భామలకు యాడ్ రెవెన్యూని పెంచుతోంది.అదంతా సరే.. నలుగురితో నారాయణ అంటూ.. శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ కూడా సామాజిక మాధ్యమాల్లో హుషారెత్తిపోతోంది. తాజాగా ఈ అమ్మడు ఓ అథ్లెటిక్ ఫీట్‌ని ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. అర్థ చంద్రాకారంలో విల్లులాగా ఒంగిపోతూ జాకీ అద్భుతమైన ఫీట్‌నే వేసింది. వీడియో ఆద్యంతం రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చి బెదరగొట్టేసింది. అందాల ఆరబోతకు ఏమాత్రం బిడియపడని జాకీ తన మెడపై ఉన్న పచ్చబొట్టును ఈ వీడియోలో ఎలివేట్ చేసింది. అందుకే 14 గంటల్లో 10లక్షల మంది చూశారు ఈ వీడియో. ఒక్కో అభిమాని ఒక్కో రకం కొంటె ట్వీట్లతో చెలరేగిపోయారంటే నమ్మండి.

జాకీ ఇప్పటికిప్పుడు సల్మాన్ భాయ్ సరసన `రేస్-3` చిత్రంలో నటిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఏబీసీడీ ఫేం రెమో డి.సౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇటీవలే `రేస్ 3`లో జాక్విలిన్ లుక్‌ని రివీల్ చేశారు. ఆ లుక్ యూత్ గుండెల్లో గుబులు పుట్టించింది.