Begin typing your search above and press return to search.

తమన్నా కోసం జాకీ చాన్

By:  Tupaki Desk   |   30 July 2016 10:50 AM GMT
తమన్నా కోసం జాకీ చాన్
X
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్లో ప్రెస్టీజియస్ గా భావిస్తున్న సినిమా ‘అభినేత్రి’. ఒకేసారి తెలుగు-తమిళం-హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ఇది. తమ్మూ తొలిసారి దయ్యం పాత్ర చేయడమే కాదు.. ద్విపాత్రాభినయం కూడా చేస్తోంది ఈ సినిమాలో. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు.. టీజర్ అన్నీ కూడా ఆసక్తి రేకెత్తించాయి. ఆగస్టు 1న తమన్నా మీద స్పెషల్ గా తయారు చేసిన టీజర్ కూడా రిలీజవ్వబోతోంది. అంతకంటే ముందు ‘అభినేత్రి’ హిందీ వెర్షన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఓ పక్కన ప్రభుదేవా.. మరోపక్కన సోనూ సూద్ మధ్యలో హాట్ హాట్ గా కనిపిస్తున్న తమన్నా.. ఆమెలోపలో ట్రెడిషనల్ గా మరో తమన్నా.. మొత్తంగా ఈ పోస్టర్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. విశేషం ఏంటంటే.. ఈ పోస్టర్ని ఇంటర్నేషనల్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ రిలీజ్ చేశాడు. సోనూ సూద్ తో కలిసి జాకీ ఈ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

సోనూతో కలిసి ఓ యాక్షన్ సినిమా చేస్తున్న జాకీ.. ఆ స్నేహం కొద్దీ ఈ పోస్టర్ లాంచ్ చేశాడు. ఆగస్టు 15న ఆడియో ఫంక్షన్ చేసుకోబోతున్న అభినేత్రి.. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘నాన్న’ ఫేమ్ ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ అంటున్నారు. ప్రభుదేవా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో కోన వెంకట్ అందిస్తున్న సంగతి తెలిసిందే.