Begin typing your search above and press return to search.

నీదే ఎక్కువ ఎక్స్ పోజింగ్.. కాదు నీదే

By:  Tupaki Desk   |   25 July 2016 9:57 AM GMT
నీదే ఎక్కువ ఎక్స్ పోజింగ్.. కాదు నీదే
X
ఇదేం గోలండీ బాబూ.. కామెడీగా కూడా ఇలాంటి కామెంట్లు చేసుకుంటారా ఎవరైనా అంటే.. అదిగో అక్కడ కుర్ర హీరో వరుణ్‌ దావన్ అండ్ సెక్సీ అందాల పరిణీతి చోప్రా ఇదే విధంగా కొట్టుకుంటున్నారు. పరిణీతి అయితే మరీ ఘోరంగా కామెంట్లు చేసేస్తోంది. ఇంతకీ ఈ కామెడీ అంతా ఏంటో చూద్దాం పదండి.

త్వరలో విడుదల కానున్న ''డిష్యూం'' సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేస్తోంది పరిణీతి చోప్రా. 'జానేమన్.. ఆహ్!!' అంటూ సాగే ఈ పాటలో అమ్మడు చాలా హాటుగా తన అందాలను దారపోస్తోందిలే. అయితే ఇప్పుడు మేకింగ్ వీడియో కోసం ఇచ్చిన ఇంటర్యూలో కూడా అమ్మడు అంతే హాటుగా కనిపిస్తుంటే.. పక్కనే ఉన్న వరుణ్‌ దావన్.. 'చూడండి ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తోందో' అంటూ ఆమె క్లీవేజ్ వైపు చూడమని హింటివ్వసాగాడు. వెంటనే పరిణీతి నవ్వుతూ.. నాకంటే నువ్వే ఎక్స్ పోజింగ్ చేస్తున్నావ్ చూడూ అంటూ అతగాడి షర్టు పై రెండు గుండీలు లేకపోవడాన్ని చూపించి.. వామ్మో అంటోంది. మొత్తానికి ఇద్దరూ ఎవరెక్కువ క్లీవేజ్ చూపించారనే డిస్కషన్ పెట్టేశారులే.

మామూలు ఐటెం సాంగుల్లో అందాలు దారపోయడమే కాదు.. వాటి గురించి ఇలా మాట్లాడుతూ మరింత హాట్ టాపిక్ అయిపోవడం ఈ బాలీవుడ్డోళ్ళకే చెల్లిందిలే.