మెగా హీరోకు నందమూరి సాయం

Wed Mar 27 2019 11:40:16 GMT+0530 (IST)

ఆరు వరస డిజాస్టర్ల తర్వాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న చిత్రలహరి వచ్చే నెల 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే మార్కెట్ పరంగా బాగా డ్యామేజ్ లో ఉన్న తేజుకి ఇది భారీ హిట్ కావాల్సిన అవసరం చాలా ఉంది. గ్లాస్ మేట్స్ సాంగ్ యూత్ కి మందురాయుళ్లకు కనెక్ట్ అయిపోయింది. అయితే సాధారణంగా మెగా హీరో సినిమాకు ఉండాల్సిన రేంజ్లో  దీనికి బజ్ లేదన్న మాట వాస్తవం.అందుకే ప్రమోషన్ విషయంలో మైత్రి సంస్థ ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. త్వరలో జరపబోయే ప్రీ రిలీజ్ ని సైతం భారీ ఎత్తున సం థింగ్ స్పెషల్ అనేలా ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా ఏ మెగా హీరో సినిమా ఫంక్షన్ అయినా చిరు లేదా ఆ ఫామిలీలో హీరోలు ఎవరో ఒకరు గెస్ట్ గా రావడం ఆనవాయితీ

కానీ ఈ సారి చిత్రలహరికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. జనసేన పార్టీ రాజకీయ క్షేత్రంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మెగా హీరోలు ఏ పబ్లిక్ ఫంక్షన్ లో కనిపించినా ఆ నినాదాలతోనే ప్రాంగణాలు హోరెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఇబ్బంది రాకుండా తారక్ ను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

దీని వెనుక చరణ్ సాయం కూడా ఉందని తెలిసింది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నప్పుడు తేజు కోసం అతిధిగా వెళ్ళమని చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కు  స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాడట. తామిద్దరం ఎంతో గొప్ప స్నేహితులమో మీడియా సాక్షిగా చెప్పిన తారక్ ఇప్పుడు ఈ మాటను అంత ఈజీగా కాదనగలడా. ఒకవేళ నిజమైతే చిత్రలహరి వైపు యంగ్ టైగర్ ఫాన్స్ కూడా ఓ లుక్ వేసే ఛాన్స్ ఉంది