Begin typing your search above and press return to search.

25 కేజీలు తగ్గితే ఇలా వుంటుందా??

By:  Tupaki Desk   |   31 July 2015 3:39 PM GMT
25 కేజీలు తగ్గితే ఇలా వుంటుందా??
X
ఆ అమ్మాయిని గతంలో చూసిన వాళ్ళు నువ్వు ఫ్యూచర్ లో ఏమి అవుతావ్ నానా అని అడిగితీ ఆమె నేను ప్రొడ్యూసర్ అవుతా, డైరెక్టర్ అవుతా, హార్టికల్చర్ మీద రీసెర్చ్ చేస్తా అంటూ సమాధానాలు చెప్పింది. కాని ఒక రోజు అదే అమ్మాయి బాలీవుడ్ జనాలకు తన డెసిషన్ మార్చుకుని షాక్ ఇస్తుందని ఎవరూ ఓహించలెదు.

ప్రముఖ నిర్మాత, దర్శకుడు జె పి దత్తా వున్నారు చూడండి.. ఆయన కుమార్తె నిధి దత్తా. అమ్మడు ఒకప్పుడు చాలా లావుగా ఉన్దెది. ఇప్పుడు చూస్తే మాత్రం సడన్ గా ఓ పారిజాతం టైపులో కనిపించింది అమ్మదు. గడిచిన సంవత్సరంలో అమ్మడు ఏకంగా 25 కేజీలు తగ్గిపోయింది. రకరకాల ఫైబర్ డైట్ తినేసి ఇలా వెయిట్ తగ్గిపోయిందట. అప్పట్లో సొనమ్ కపూర్, సొనక్షి సిన్హా కూడా ఇదేవరుస. ముందులో స్థూలకాయం ఉన్నట్లు కనిపించేవారు. ఇప్పుడేమో మెరుపు తీగల్లాగా తయారయ్యారు. ఇప్పుడు నిధి దత్తా కూడా సేమ్ అదే బాటలో నదుస్తొన్ది.

ఇంతకీ అమ్మడుని వెండి తెరకు ఎవరు పరిచయం చేస్తున్నారు? కరణ్ జోహార్ లేక యష్ రాజ్ ఫిల్మ్స్ వారా? అబ్బే కాదు. ఇక హీరోయిన్లు అందరూ అదే బ్యానర్ నుండి పరిచయం అవుతారు ఏంటండి.. ఈ సారి నిధి తండ్రి జెపి దత్తా ఒక సినిమా ప్రొడ్యూస్ చెస్తున్నరు. ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో అమ్మడు హీరోయిన్ గా పరిచయం అవుతోంది.