Begin typing your search above and press return to search.

వావ్.. మళ్లీ గులాబి కాంబినేషన్

By:  Tupaki Desk   |   21 Jan 2017 8:31 AM GMT
వావ్.. మళ్లీ గులాబి కాంబినేషన్
X
గులాబి.. టాలీవుడ్ బెస్ట్ లవ్ స్టోరీస్‌లో ఒకటిగా చెప్పుకోదగ్గ సినిమా. కృష్ణవంశీ లాంటి విలక్షణ దర్శకుడు ఈ సినిమాతోనే పరిచయమయ్యాడు. జేడీ చక్రవర్తి హీరోగా స్థిరపడిందీ ఈ చిత్రంతోనే. అప్పట్లో ‘గులాబి’ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగా ఒక హీరో-దర్శకుడు కలిసి హిట్టు కొట్టాక.. మళ్లీ ఆ కాంబినేషన్ కచ్చితంగా తెరమీదికి వస్తుంటుంది. కానీ కృష్ణవంశీ మాత్రం మళ్లీ జేడీతో సినిమా చేయనే లేదు. ఐతే రెండు దశాబ్దాల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ ‘గులాబి’ కాంబినేషన్ ను చూడబోతున్నాం. కృష్ణవంశీ కొత్త సినిమా ‘నక్షత్రం’లో జేడీ ఓ కీలక పాత్ర చేస్తుండటం విశేషం.

‘నక్షత్రం’లో జేడీ చక్రవర్తి ఆర్డీఎక్స్ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తున్న కృష్ణవంశీ.. జేడీ కోసం కూడా ఓ ఏవీ వదిలాడు. ఆ మధ్య చేసిన ‘డైనమైట్’ తరహా గెటప్ లో కనిపిస్తున్నాడు జేడీ ఇందులో. హైదరాబాద్‌ లో తనకు పరిచయమై.. స్నేహితుడైన తొలి వ్యక్తుల్లో జేడీ ఒకడంటూ ఈ ఏవీలో పేర్కొన్నాడు కృష్ణవంశీ. ఇప్పటికే ‘నక్షత్రం’లో ప్రకాష్ రాజ్ లాంటి విలక్షణ నటుడు చేస్తున్నాడు. ఇప్పుడు జేడీ కూడా యాడ్ అయ్యేసరికి సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. బహుశా జేడీది విలన్ పాత్రే కావచ్చు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా చేస్తుండగా.. సాయిధరమ్ తేజ్ - రెజీనా - ప్రగ్యా జైశ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/