Begin typing your search above and press return to search.

పవన్ సినిమాలో ఐటెం కాదు.. అంతకుమించి!

By:  Tupaki Desk   |   23 Nov 2017 11:30 PM GMT
పవన్ సినిమాలో ఐటెం కాదు.. అంతకుమించి!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫక్తు ఐటెం సాంగ్స్ తక్కువే ఉంటాయి. కథలో భాగంగా స్పెషల్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటుంటాడు పవన్. అతను హీరోగా తెరకెక్కుతున్న ‘అజ్నాతవాసి’లో కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుందట. ఇది మామూలు ఐటెం సాంగ్స్ కంటే మిన్నగా ఉంటుందని.. ఈ పాట అభిమానుల్ని ఊపేస్తుందని అంటున్నారు.

ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి వస్తున్న తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. పేలిపోయే పాట ఒకటి రెడీ చేశాడట. ఈ పాట ట్యూన్.. లిరిక్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయని.. సినిమాకు ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ‘అత్తారింటికి దారేది’లో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ.. పాట తరహాలో దీన్ని స్పెషల్ గా తీర్చిదిద్దుతున్నాడట త్రివిక్రమ్. మరి ఈ పాటలో అంత స్పెషాలిటీ ఏముందో ఆడియో విడుదలైనపుడు.. ఆ తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చినపుడు తెలుసుకోవాలి.

ప్రస్తుతం ‘అజ్నాతవాసి’ చివరి షెడ్యూల్లో ఉంది. త్వరలోనే షూటింగ్ ముగియనుంది. డిసెంబరు 14న ఈ చిత్ర ఆడియో రిలీజవుతుందని అంటున్నారు. ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ సరసన కీర్తి సురేష్.. అను ఇమ్మాన్యుయెల్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు.