Begin typing your search above and press return to search.

మ‌న మీడియా ఎంత అతి చేసిందంటే..

By:  Tupaki Desk   |   23 May 2017 5:07 AM GMT
మ‌న మీడియా ఎంత అతి చేసిందంటే..
X
మీడియా అంటే జ‌నాల‌కు రాను రాను ఏహ్య భావం క‌లుగుతుండ‌టానికి కార‌ణాలు లేక‌పోలేదు. మామూలు విష‌యాల్ని కూడా వివాదాస్పదంగా మార్చి.. అగ్గి రాజేయాల‌ని చూసే మ‌హానుభావుల‌కు .ప్ర‌స్తుత మీడియా రంగంలో కొద‌వే లేదు. అందులోనూ అగ్గికి ఆజ్యం పోయ‌డానికి సోష‌ల్ మీడియా జ‌నాలు కూడా సిద్ధంగా ఉండ‌నే ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మీద వ‌ర్ణ హాలీవుడ్ న‌టుడి వ‌ర్ణ వివ‌క్ష వ్యాఖ్య‌లంటూ తాజాగా చెల‌రేగిన వివాదం ఇలాంటిదే. ముందు.. వెనుక ఏం జ‌రిగిందో చూసుకోకుండా మ‌ధ్య‌లో జ‌రిగిన విష‌యాన్నే పెద్ద‌దిగా చేసి చూపించి వివాదానికి తెర‌తీసింది మ‌న మీడియా. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..

ప్రియాంక చోప్రా వండిన వంటకాన్ని కుక్కలు తినే ఆహారంగా అభివ‌ర్ణించాడంటూ సెలబ్రిటీ షెఫ్‌ గోర్డాన్‌ రామ్సేపై మన మీడియా ఆరోప‌ణ‌లు చేస్తోంది. ప్రియాంక కిచిడి.. చికెన్‌ సూప్‌ చేసి దాని ఫోటోని ఇంటర్నెట్‌ లో పెడితే అది చూడ్డానికి డాగ్స్‌ డిన్నర్ లాగా ఉంద‌ని అన్నాడు రామ్సే. అత‌ను ఆ కామెంట్ చేసిన మాట వాస్త‌వ‌మే కానీ.. అంత‌కుముందు.. వెనుక ఏం జ‌రిగింద‌న్న‌ది కీల‌కం. రామ్సే పాల్గొన్న‌ది రోస్ట్ అనే కార్య‌క్ర‌మం. ఇందులో భాగంగా సెలబ్రిటీల వంటల గురించి గోర్డాన్‌ హర్టింగ్‌ కామెంట్స్‌ చేయాల్సి ఉంటుంది. వంట చేసింది ఎవరనేది అతడికి ముందు చెప్పరు. కేవలం ఫోటో చూపించి.. అతను దానిపై వ్యంగ్యంగా.. స‌ర‌దాగా కామెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రియాంక వంట గురించి కూడా ఫొటో చూసి అలాగే కామెంట్ చేశాడ‌త‌ను. త‌ర్వాతే అది ఆమె వంట‌కం అని చెప్పారు. ఐతే మ‌న మీడియా వాళ్లు మాత్రం ఓ భార‌తీయ న‌టి వంట‌కాన్ని కుక్క‌లు తినే ఆహారంగా పేర్కొన్నాడంటూ దీన్ని కాంట్ర‌వ‌ర్శీగా మార్చే ప్ర‌య‌త్నం చేసింది.