Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ శంక‌ర్ తొలిరోజు వ‌సూళ్లు

By:  Tupaki Desk   |   19 July 2019 5:05 AM GMT
ఇస్మార్ట్ శంక‌ర్ తొలిరోజు వ‌సూళ్లు
X
ఎన‌ర్జిటిక్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇవేవీ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ పై ప్ర‌భావం చూప‌లేదు. ఇస్మార్ట్ టీమ్ ప్ర‌చారార్భాటం.. వివాదాలు ఈ సినిమాకి క‌లిసొచ్చాయి. తొలిరోజు తొలి వీకెండ్ వ‌సూళ్ల‌కు ఎలాంటి డోఖా లేద‌ని ఆన్ లైన్ బుకింగ్స్ చూస్తేనే అర్థ‌మైంది. ఇక ఈ సినిమాకి మాస్ ఆద‌ర‌ణ బావుండ‌డం క‌లిసొస్తోంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

తాజాగా ఇస్మార్ట్ శంక‌ర్ తొలి రోజు వ‌సూళ్ల రిపోర్ట్ అందింది. నైజాం-3.10 కోట్లు.. సీడెడ్-1.20 కోట్లు.. వైజాగ్-85ల‌క్ష‌లు.. గుంటూరు- 57ల‌క్ష‌లు .. తూ.గో జిల్లా- 50ల‌క్ష‌లు.. ప‌.గో జిల్లా- 40ల‌క్ష‌లు.. కృష్ణ -52ల‌క్ష‌లు .. నెల్లూరు- 30ల‌క్ష‌లు.. యూఏ-86ల‌క్ష‌లు వ‌సూలైంది. ఏపీ-తెలంగాణ క‌లుపుకుని 7.44కోట్లు వ‌సూలైంది. రామ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని ఇస్మార్ట్ టీమ్ చెబుతోంది.

అలాగే అమెరికాలో రామ్ కెరీర్ సెకండ్ బెస్ట్ గా ఇస్మార్ట్ శంక‌ర్ రికార్డుల‌కెక్కింది. రామ్ - కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` అమెరికాలో తొలి రోజు 105 కె డాల‌ర్లు (మూవీ పాస్ అడ్వాంటేజ్) వసూలు చేయ‌గా.. ఇస్మార్ట్ శంక‌ర్ 55 లొకేష‌న్ల నుంచి 52కె డాల‌ర్లు మొద‌టి రోజు వ‌సూలు చేసింద‌ని నిన్న‌టి సాయంత్రానికి రిపోర్ట్ అందింది. ఇత‌ర‌త్రా భార‌త దేశం నుంచి 40లక్ష‌లు వ‌సూలైంది. క‌ర్నాట‌క రిపోర్ట్ ఎంత వ‌సూలు చేసింది అన్న‌ది తెలియాల్సి ఉంది. 20 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించి17 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ చేశారు. ఓవ‌రాల్ గా తొలి రోజు 8కోట్ల మేర వ‌సూళ్లు ద‌క్కించుకుంది అంటే మిగ‌తా రెండు మూడు (శ‌ని-ఆది సెల‌వులు) దినాలు వ‌సూళ్లు బావుంటాయ‌నే అర్థం. అంటే సోమ‌వారం నుంచి అస‌లు ప‌రీక్ష మొద‌ల‌వుతుంది. ఈలోగానే ఈ సినిమా సేఫ్ గా పెట్టిన బ‌డ్జెట్ వెన‌క్కి తెస్తుందా? అన్న‌ది చూడాలి.