Begin typing your search above and press return to search.

పూరి ఏం మారాడు.. ఏమీ మారలేదు

By:  Tupaki Desk   |   22 Feb 2017 6:21 AM GMT
పూరి ఏం మారాడు.. ఏమీ మారలేదు
X
పూరి జగన్నాథ్ కొత్త సినిమా ‘రోగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్లు వచ్చేశాయి. ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయమవుతున్న కన్నడ కుర్రాడు ఇషాన్ బాగానే ఉన్నాడు. అతడి లుక్ బాగుంది. కుర్రాడు మంచి అందగాడే. ఫేస్ వాల్యూ బాగానే ఉందని.. సినిమాల్లో నిలదొక్కుకునే అవకాశం ఉందని ఫీడ్ బ్యాక్ వస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ పోస్టర్లలో పూరి జగన్నాథ్ ఏం కొత్తదనం చూపించాడన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పూరి మార్కు హీరో ఎప్పుడూ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు ఇషాన్ కూడా. హీరో కాస్ట్యూమ్స్.. స్టైలింగ్ అన్నీ కూడా పూరి గత సినిమాల మీదిరే ఉన్నాయి. హార్ట్ ఎటాక్.. లోఫర్.. ఇజం సినిమాల్లో హీరోలు ఎలా ఉన్నారో ఇషాన్ కూడా దాదాపుగా అలాగే కనిపిస్తున్నాడు.

‘రోగ్’ అనే పూరి మార్కు టైటిల్.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే సినిమా ఎలా ఉంటుందో జనాలకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తోంది. పైగా ఇది ‘ఇడియట్’కు సీక్వెల్ కాని సీక్వెల్ అంటున్నారు. ‘మరో చంటిగాడి ప్రేమకథ’ అనే క్యాఫ్షన్ కూడా సినిమా ఎలా ఉండబోతోందో ఒక క్లారిటీ ఇచ్చేస్తోంది. ‘ఇడియట్’ సినిమా అప్పటికి కొత్త. హీరో క్యారెక్టరైజేషన్ జనాలకు భలేగా అనిపించింది. కానీ తర్వాత పూరి సినిమాలన్నింట్లో కూడా హీరో ఇలాగే కొంచెం తేడాగా కనిపిస్తూ వచ్చాడు. చివరికి ఈ తరహా క్యారెక్టరైజేషన్ అంటేనే మొహం మొత్తేలా తయారైంది. తన సినిమాల్నే మళ్లీ మళ్లీ కాపీ కొడుతూ.. చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు పూరి. మరి ‘రోగ్’ కూడా ఆ కోవలోనే ఉంటుందో.. లేక సినిమాలో అయినా ఏమైనా కొత్తదనం చూపిస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/