Begin typing your search above and press return to search.

శ్రీదేవి కూతురు సినిమా ఎలా ఉందంటే..

By:  Tupaki Desk   |   19 July 2018 11:29 AM GMT
శ్రీదేవి కూతురు సినిమా ఎలా ఉందంటే..
X
మరాఠిలో హిట్ అయిన సైరట్ మూవీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా రిమేక్ గా బాలీవుడ్ లో సినిమా తెరకెక్కుతోంది. శ్రీదేవి కూతురు జాహ్నవి హీరోయిన్ గా.. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా రూపొందుతున్న ‘దఢక్’ సినిమా జూలై 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా బాలీవుడ్ సెలెబ్రెటీల కోసం దఢక్ మూవీ స్పెషల్ షో వేశారు. సోనమ్ కపూర్ - అనిల్ కపూర్ తో పాటు కరణ్ జోహర్ - అనన్య పాండే - వరుణ్ ధావన్ సినిమా చూసి ప్రశంసించాడు. తొలిసినిమా అయినా జాహ్నవి - ఇషాన్ అద్భుతంగా నటించారంటూ ప్రశంసలు కురిపించారట..

తాజాగా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ట్వీట్ చేశారు.. ’’జాహ్నవి - ఇషాన్ స్టార్స్ అయిపోయారు.. తెరపై వారి లవ్ - యాక్షన్ అందరి మనసు దోచుకుంటుంది. అందరికీ నచ్చే సినిమా’’ అని కొనియాడారు. ఇక సోనమ్ కపూర్ కూడా ప్రశంసలు కురిపించింది. ‘జాహ్నవి ఎంట్రీ అదరిపోయింది. చాలా గర్వంగా ఉంది. ఇషాన్ ఆకట్టుకున్నాడు. వీరిని తెరపై బాగా చూపించిన దర్శకుడు శశాంక్ కు కృతజ్ఞతలు. స్క్రీన్ మీద జంటను చూస్తే ఆశ్చర్యపోతారు..’ అంటూ ట్వీట్ చేశారు. సంజయ్ కపూర్ కూడా జాహ్నవి ఎంట్రీ ఎక్స్ ట్రార్డినరీ అని కొనియాడారు..

జాహ్నవి తన తల్లి శ్రీదేవి అందాన్ని పుణికి పుచ్చుకుందని ఈ సినిమా చూసిన వారు మెచ్చుకుంటున్నారు. తల్లి నటవారసత్వాన్ని భర్తీ చేసేలా నటించిందని కీర్తిస్తున్నారు. ఈ మూవీ జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.