Begin typing your search above and press return to search.

బుర్రకథలో రెండు కథలున్నాయా ?

By:  Tupaki Desk   |   25 Jun 2019 4:49 AM GMT
బుర్రకథలో రెండు కథలున్నాయా ?
X
మన దర్శకులు ఇంకొకరి నుంచి స్ఫూర్తి తీసుకోవడం ఏవో విదేశీ సినిమాలు చూసి మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసుకోవడం ఎప్పటినుంచో ఉన్నదే. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ వాడకం పెరిగిపోయింది కాబట్టి అలాంటివి జనం తొందరగా పసిగడుతున్నారు. ఇదంతా విడుదలయ్యాక జరిగే వ్యవహారం. కానీ ఇప్పుడు టీజర్లతోనే దానికి మూలాలు వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విషయానికి వస్తే నిన్న ఆది సాయికుమార్ బుర్రకథ ట్రైలర్ విడుదలైంది. ఒకే మనిషిలో రెండు బుర్రలు ఉండి ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా రెండు రకాలుగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ మీద తీసినట్టు దర్శకుడు రత్నబాబు దాన్ని ఓపెన్ గా రివీల్ చేశారు. కట్ చేస్తే గత ఏడాది నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచిలో కూడా పాయింట్ ఇదే. కాకపోతే అందులో చెయ్యి ఇందులో బుర్ర. అందులో సిస్టర్ సెంటిమెంట్ ఇందులో ఫాదర్ ఎమోషన్. మిగిలిన లైన్ లో చాలా పోలికలు కనిపిస్తున్నాయి

ఇదే ఓ ట్విస్ట్ అనుకుంటే వచ్చే నెల విడుదల కానున్న పూరి రామ్ ల ఐస్మార్ట్ శంకర్ లో కూడా హీరో పాత్ర డ్యూయల్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ మీద ఉంటుందనే టాక్ ఉంది. కాకపోతే పుట్టుకతో రెండు బుర్రలు అనే పాయింట్ మీద కాకుండా ఓ సైంటిస్ట్ చేసిన ప్రయోగం వల్ల హీరో బుర్ర మారిపోవడం అనే థీమ్ తో తీశారట. ఇది నిజమో కాదో కానీ లీక్ అయిన న్యూస్ ఇదే చెబుతోంది.

ఈ లెక్కన ముందు వచ్చే బుర్రకథకు ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడీ టాక్ నిజమైతే పూరి సినిమాతో దీన్ని పోలుస్తారు. ఒకవేళ బుర్రకథ అంచనాలు అందుకోకపోతే ఇదంతా లైట్ అనేసుకోవచ్చు. ఒక వేళ హిట్ అయితే మాత్రం ఐస్మార్ట్ శంకర్ తన పాయింట్ వేరే అని చూపించుకోవడంతో పాటు సాలిడ్ కంటెంట్ తో కొట్టాలి. ఈ చిక్కుముడి తేలాలంటే మాత్రం వచ్చే నెల 18 దాకా ఆగాల్సిందే