Begin typing your search above and press return to search.

`మ‌న్మ‌ధుడు 2` స్టోరీ ఇదేనా?

By:  Tupaki Desk   |   19 April 2019 5:50 AM GMT
`మ‌న్మ‌ధుడు 2` స్టోరీ ఇదేనా?
X
కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మ‌న్మ‌ధుడు 2 సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పోర్చుగ‌ల్ లో కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆన్ సెట్స్ అడ‌వి ప్రాంతంతో నాగార్జున క‌స‌ర‌త్తులు చేస్తూ అభిమానులకు షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. 60 వ‌య‌సులోనూ ఆయ‌న న‌వ‌మ‌న్మ‌ధుడిలా ఎందుకు క‌నిపిస్తున్నారో అంద‌రికీ అర్థ‌మైంది. అదంతా స‌రే.. అస‌లు మ‌న్మ‌ధుడు 2 క‌థేమిటి? మ‌న్మ‌ధుడు క‌థ‌తో పోలిస్తే ఇందులో కొత్త‌ద‌నం ఏంటి? అంటే.. ప్ర‌స్తుతం పార్ట్ 2 క‌థ గురించి ర‌క‌ర‌కాల స్పెక్యులేష‌న్స్ ఉత్కంఠ పెంచుతున్నాయి.

మ‌న్మ‌ధుడు క‌థ‌ను ప‌రిశీలిస్తే.. అభిరామ్ (నాగార్జున) ప్రకటనల‌ ఏజెన్సీ య‌జ‌మాని. త‌నే మేనేజర్ కం కంపెనీ ఓన‌ర్ గా లీడ్ చేస్తుంటాడు. అత‌డికి అమ్మాయిలంటే గిట్ట‌దు. వాళ్ళని దేశద్రోహులుగా భావిస్తాడు. అభిరామ్ మామ (తనికెళ్ళ భరణి) ఆ కంపినీకి చైర్మన్ హరిక (సోనాలి బింద్రె) ని అసిస్టెంట్ మేనేజర్ గా అభికి తేలియకుండా నియమిస్తాడు. అమ్మాయిలంటే గిట్ట‌ని అభిరామ్ లో హారిక రాక‌తో వ‌చ్చిన పెనుమార్పులేంటి? త‌న‌ని ఎలా ట్రీట్ చేశాడు? అన్న‌ది మిగ‌తా క‌థాంశం. అభిరామ్ - హరికల క‌థ చివ‌రికి ఏ కంచికి చేరింది.. అన్న‌ది తెర‌పై ఆద్యంతం వినోదాత్మ‌కంగా ఎమోష‌న‌ల్ గా చూపించారు.

చ‌క్క‌ని రొమాంటిక్ కామెడీ ఇది. ఈ చిత్రానికి విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నాగార్జున, సోనాలి బింద్రె, అన్షు, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, సునిల్, సుధా, రంగనాథ, బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రమాణ్యం లాంటి స్టార్లు ముఖ్యపాత్రాలలో నటించారు. నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

మ‌న్మ‌ధుడు (2002) క‌థ‌కు `మ‌న్మ‌ధుడు 2` క‌థ కొన‌సాగింపుగానే ఉంటుందా? అంటే .. కొంత వ‌ర‌కూ మాత్ర‌మే క‌నెక్ష‌న్ .. కంటిన్యుటీ ఉంటుంది. అయితే ఇందులో సిస్ట‌ర్ సెంటిమెంట్ అన్న‌ది కొత్త ఎలిమెంట్. దాని చుట్టూనే క‌థాంశం ప్ర‌ధానంగా సాగుతుంద‌ట‌. మ‌రో ర‌కంగా ఇది హిట్ల‌ర్ త‌ర‌హా కాన్సెప్ట్ అని కూడా చెబుతున్నారు. నాగార్జున‌కు న‌లుగురైదుగురు సిస్ట‌ర్స్ ఉంటారు. గారాల చెల్లెళ్ల‌కు అన్నీ తానే. చెల్లెళ్ల పెళ్లిల్లు చేసే ప‌నిలో త‌న‌కు వ‌య‌సైపోతుంది.. వ‌య‌సైపోయిన మన్మ‌ధుడికి పిల్ల‌ను వెతికే ప్ర‌య‌త్నం.. ఆ క్ర‌మంలోనే కామెడీ.. బోలెడంత ఫ‌న్.. ఎంట‌ర్‌టైన్ మెంట్.. ఇలా క‌థాంశం సాగుతుంద‌ట‌. ఇదో హాలీవుడ్ సినిమాకి స్ఫూర్తి అని చెబుతున్నారు... ఆ సినిమా ఏది? అన్న‌ది అటుంచితే కింగ్ ఈసారి త‌న పాత్ర‌ను అద్భుతంగా పండించేందుకు శ్ర‌మిస్తున్న తీరు అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది. ఈ చిత్రంలో అందాల ర‌కుల్ ప్రీత్ అత‌డికి జోడీగా న‌టిస్తోంది. స‌మంత ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఒక సిస్ట‌ర్ సెంటిమెంట్ క‌థ‌లో మామ‌- కోడ‌ళ్లు (నాగ్ - సామ్) ఎలా క‌నిపించ‌బోతున్నారో అంటూ అక్కినేని అభిమానుల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది.