Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ హీరోయిన్‌ ప్రేమలో ఉందా?

By:  Tupaki Desk   |   22 Oct 2018 8:44 AM GMT
ప్రభాస్‌ హీరోయిన్‌ ప్రేమలో ఉందా?
X
బాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో స్టార్‌ హీరోయిన్‌ గా వరుసగా పెద్ద చిత్రాల్లో నటిస్తూ దూసుకు పోతున్న ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ మరో వైపు సౌత్‌ లో ‘సాహో’ చిత్రంతో అడుగు పెట్టబోతున్న విషయం తెల్సిందే. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ‘సాహో’ చిత్రంలో శ్రద్దా కపూర్‌ నటిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం సెలబ్రెటీ ఫొటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్థ తో ప్రేమలో ఉన్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

శ్రద్దా కపూర్‌ మరియు రోహన్‌ లు చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరు ఇప్పుడు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరు వీకెండ్స్‌ పార్టీల్లో - ఫంక్షన్స్‌ లో తెగ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి నుండి ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకైనా వీరిద్దరి ప్రేమ విషయమై అధికారికంగా బయటకు వస్తుందనే అభిప్రాయం హిందీ సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

బాలీవుడ్‌ లో ప్రేమ కథలు కొత్తేం కాదు. అలాగే శ్రద్దా కపూర్‌ మరియు రోహన్‌ ల ప్రేమ కథ కూడా ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా ఉంది. ప్రస్తుతం శ్రద్దా కపూర్‌ ‘సాహో’ చిత్రంలో నటిస్తూనే మరో వైపు ప్రముఖ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు కాకుండా ఇంకా పలు చిత్రాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.