ఆర్ ఆర్ ఆర్ లో మున్నా భాయ్ ?

Wed Mar 20 2019 11:13:30 GMT+0530 (IST)

ప్రెస్ మీట్ జరిగి వారం కావడం ఆలస్యం ఆర్ ఆర్ ఆర్ గురించిన వార్తలకు రెక్కలు వచ్చేశాయి. ఆ రోజు చెప్పిన విశేషాల్లో సగం అంతకు ముందే లీకైనవి అయినప్పటికీ రాజమౌళి అన్ని పూసగుచ్చి చెప్పడంతో చాలా విషయాలకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే బాలీవుడ్ త్రయం నుంచి అజయ్ దేవగన్ అలియా భట్ ని తీసుకున్న జక్కన్న ఇంకొందరు స్టార్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇన్ సైడ్. పాన్ ఇండియా మార్కెట్ కోసం ఆర్టిస్టులను తీసుకోను అని చెప్పిన రాజమౌళి కాస్టింగ్ జరుగుతున్న తీరు మాత్రం దానికి విరుద్ధంగా ఉంది.విశ్వసనీయ సమాచారం మేరకు మున్నాభాయ్ సంజయ్ దత్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా సంజయ్ దత్ ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితేనే ఇతర బాషల వైపు మొగ్గు చూపుతాడు. కానీ ఆర్ ఆర్ ఆర్ గురించి రాజమౌళి టేకింగ్ గురించి అవగాహనా ఉన్నవాడు కాబట్టి నిజంగా ఆఫర్ వచ్చి ఉంటే మాత్రం పాజిటివ్ గానే అలోచించి ఉండవచ్చు. ఇప్పటికే కెజిఎఫ్ లో ఉన్నాడనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అంతేకాదు పద్మావత్ హీరో అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కథానాయకుడు షాహిద్ కపూర్ కోసం కూడా చర్చలు జరుగుతున్నట్టు వినికిడి. స్వతంత్రం రాకపూర్వం కథ కాబట్టి చాలా పాత్రలు ఉన్నాయని అందుకోసం పేరున్న వాళ్ళనే తీసుకోవాలనే ఉద్దేశంతో రాజమౌళి ఈ రకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇప్పుడీ లిస్ట్ చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ ని బాలీవుడ్ లో ఎంత రేంజ్ లో టార్గెట్ చేశారో అర్థమవుతుంది.