అదే నిజమైతే చాలా సంతోషం : రష్మిక

Thu May 23 2019 07:00:02 GMT+0530 (IST)

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. ఇదే సమయంలో ఈ అమ్మడు తమిళంలో కూడా నటిస్తోంది. ఇప్పటికే ఈమె కార్తి హీరోగా బక్కియరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటించేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలోనే ఈమె తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందబోతున్న ఆయన 64వ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం విజయ్ తన 63వ సినిమాను అట్లీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే పూర్తి కాబోతుంది. క్రీడా నేపథ్యంలో రూపొందుతోన్న ఆ సినిమా తర్వాత ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో రష్మికను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

విజయ్ తో మూవీ కోసం నన్ను ఎవరు సంప్రదించలేదు. ఇప్పటి వరకు ఆ సినిమాకు నన్ను ఎవరు కలవలేదు. ఒక వేళ ఆ వార్తలే నిజమైతే చాలా సంతోషిస్తాను. పుకార్లు నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో ఈమె ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాతో పాటు ఇంకా పలు సినిమాలు కూడా ఈ అమ్మడు కమిట్ అయ్యింది. సౌత్ లోనే ప్రస్తుతం మోస్ట్ బిజీ హీరోయిన్స్ లో ఈ అమ్మడు ఒకరుగా నిలుస్తోందని చెప్పుకోవచ్చు.