గర్భవతి అని తెలిసే పెళ్లి?

Wed Feb 20 2019 08:00:01 GMT+0530 (IST)

గత కొన్ని నెలలుగా ప్రియాంక చోప్రా ప్రేమాయణం పెళ్లి వ్యవహారంపై జరిగిన హడావుడి ఎలాంటిదో తెలిసిందే. నిరంతరం పీసీ- నిక్ జోనాస్ ఎఫైర్ వార్తలు వేడెక్కించాయి. ఆ క్రమంలోనే గత ఏడాది చివరిలో ఈ జంట జైపూర్ లో వివాహం చేసుకున్నారు. వరల్డ్ వైడ్ ఈ పెళ్లి వేడుక గురించి చర్చించుకున్నారు. ఆ తర్వాత పీసీ లండన్ కోడలుగా పాపులరైంది. వివాహానంతరం నిక్ జోనాస్ తో రొమాన్స్.. లండన్ లో తన ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోల్ని పీసీ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు షేర్ చేసింది.అదంతా సరే.. ప్రస్తుతం పీసీ గర్భవతి అన్న ప్రచారం హోరెత్తిపోతోంది. ఇది నిజమేనా? అంటే వివరాల్లోకి వెళ్లాలి. ఇటీవలే ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఓ ఫోటోని చూపిస్తూ ఇదిగో ప్రియాంక చోప్రా గర్భిణి అంటూ నెటిజనులు దుమారం సృష్టించారు. పెళ్లికి ముందే పీసీ గర్భిణి.. అందుకే అంత హడావుడిగా పెళ్లి చేసేశారు!! సడెన్ గా పెళ్లి అంటూ చెప్పిందంటే సందేహించాల్సింది ఇదే!! అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త ప్రచారానికి ఖంగు తిన్న పీసీ కుటుంబం కంగారు పడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం తాజాగా హాట్ టాపిక్ గా మారింది.

ప్రియాంక చోప్రా తల్లిగారైన మధు చోప్రా ఈ వార్తల్ని ఖండించారు. ఆ దుస్తులు సరిగా కుదరకపోవడం వల్ల .. కెమెరాను సరిగా ఉపయోగించకపోవడం వల్లనే ఆ పోటో అలా కనిపించింది. పీసీ గర్భవతి కాదు. ఒకవేళ గర్భిణి అయితే సంతోషమే కదా! అంటూ మధు చోప్రా వివరణ ఇచ్చారు. పీసీ ప్రస్తుతం `వైల్డ్ వైల్డ్ కంట్రీ ` అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ సిరీస్ ఇది. అధ్యాత్మిక వేత్త ఓషో లైఫ్ స్ఫూర్తితో ఇది రూపొందుతోంది. ఇందులో మా ఆనంద్ షీలాగా కనిపించనుంది. దీనికి పీసీ సహనిర్మాత అని తెలుస్తోంది.