Begin typing your search above and press return to search.

చై-సామ్ కి అజ్ఞాతవాసి గిఫ్టిచ్చాడట

By:  Tupaki Desk   |   12 Oct 2017 6:32 PM GMT
చై-సామ్ కి అజ్ఞాతవాసి గిఫ్టిచ్చాడట
X
ఈ నెల 6న అక్కినేని వారసుడు నాగచైతన్య.. టాలీవుడ్ బ్యూటీ సమంత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం.. ఆ తర్వాత క్రైస్తవ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు తమ సినిమా పనుల్లో కూడా పడిపోయారు. అయితే.. సరిగ్గా పెళ్లి రోజుకు అందిన ఓ అజ్ఞాత గిఫ్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది.

అజ్ఞాతవాసి అంటే గతంలో అదేదో టఫ్ వర్డ్ అనుకోవాలేమో కానీ.. ఇప్పుడైతే.. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రియల్ లైఫ్ లో కూడా మాంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ కలిసి.. చైతు-సామ్ లకు సరిగ్గా పెళ్లి సమయానికి అందేలా ఓ కాస్ట్లీ గిఫ్ట్ ను పంపారట. పెళ్లికి కుటుంబసభ్యులకు తప్ప వేరే వారికి ఆహ్వానమే లేకపోయినా.. అలాంటివేమీ పట్టించుకోకుండా.. తమ తరఫున ఇద్దరికీ ఖరీదైన డైమండ్ రింగ్స్ ను బహుమతిగా పంపినట్లు తెలుస్తోంది.

అందుకునే వరకూ అవేంటో.. ఎవరు పంపారో కూడా తెలియకుండా పంపిన ఈ వజ్రపుటుంగరాలు అందరినీ షాక్ కి గురి చేశాయని తెలుస్తోంది. అయితే.. అసలు ఇలాంటిదేమీ జరగలేదని.. ఇది రూమర్ మాత్రమే అని కొందరు వాదిస్తున్నారు కానీ.. అజ్ఞాతవాసి బహుమానం అయితే నిజమేనట.