రజనీ స్టైల్ ను ఫాలో అవుతాడా ఏంటి?

Tue Apr 16 2019 07:00:01 GMT+0530 (IST)

న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'జెర్సీ' ఏప్రిల్ 19 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు నాని.  ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నాడు. ఈ సినిమాలో నాని ఒక లవర్ బాయ్ గానే కాకుండా.. ఒక చిన్నబాబుకు తండ్రిలా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.  ఇలా తండ్రి పాత్రలో నటించడం గురించి ఆడిగితే  ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదని.. ఎలాంటి పాత్రలు చేసేందుకైనా తాను సిద్దమని అన్నాడు. అంతే కాదు.. తనకు ఈమధ్య తెల్లవెంట్రుకలు వస్తున్నాయని వాటిని దాచిపెట్టాలనే ఆలోచన కూడా తనకు లేదని అన్నాడు. న్యాచురల్ స్టార్ ట్యాగ్ కు తగ్గట్టుగా హెయిర్ కూడా న్యాచురల్ గా మెయిన్టెయిన్ చేస్తాడన్నమాట.  సినిమాకోసం హెయిర్ డై వేసుకోవడం హీరోలకు తప్పదు.  కానీ చాలామంది స్టార్స్ నిజ నీవితంలో మేకప్ లేకుండా అసలు బైటకు రారు.  రజనీకాంత్.. అజిత్ లాంటి వాళ్ళే దీనికి ఎక్సెప్షన్. నాని వరస చూస్తుంటే వారిని ఫాలో అయ్యేలా ఉన్నాడు.

'జెర్సీ' గురించి మాట్లాడుతూ ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి కలిగేలా చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.  దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఒక జెన్యూన్ ఫిలిం మేకర్ అని.. సహజమైన ఎమోషన్స్ తో ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తాడని మెచ్చుకున్నాడు.  స్క్రిప్ట్ నుంచి కొంచెం కూడా డీవియేట్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తాడని.. టాలీవుడ్ కు ఇలాంటి దర్శకులు కావాలని అన్నాడు.  'జెర్సీ' ప్రోమోస్ అయితే ప్రామిసింగ్ గా ఉన్నాయి. సినిమా హిట్ అయితే మాత్రం గౌతమ్ తిన్ననూరి క్రేజీ డైరెక్టర్ గా మారడం ఖాయమే.