Begin typing your search above and press return to search.

జియో ఆఫర్ సినిమాలను దెబ్బ కొడుతుందా ?

By:  Tupaki Desk   |   14 Aug 2019 2:30 PM GMT
జియో ఆఫర్ సినిమాలను దెబ్బ కొడుతుందా ?
X
కార్పోరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ జియో ఫైబర్ ప్రకటనను చేశాక టెలికాం ఆపరేటర్లు మొదలుకుని లోకల్ కేబుల్ టీవీ మేనేజర్ల దాకా అందరి మధ్యా ఇదే చర్చ జరుగుతోంది. ఎన్నో రంగాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ సర్వీస్ భవిష్యత్తులో జియో మోనోపొలికి దారి తీయవచ్చని అదే జరిగితే కస్టమర్లకు ఆప్షన్లు లేకుండా పోయి చెప్పిన ధరకే వస్తువులు సేవలు కొనే పరిస్థితి రావొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నవాళ్లు లేకపోలేదు.

దీని సంగతి అలా ఉంచితే విడుదల రోజే కొత్త సినిమాలు హోం ధియేటర్లో చూసే వెసులుబాటు తీసుకొస్తామని ముఖేష్ ప్రకటించడం మరో సెన్సేషన్ అని చెప్పొచ్చు. దీని గురించి తుపాకీ డాట్ కాం పలువురు ఇండస్ట్రీ పెద్దలు సీనియర్లను కలిసి దీని తాలుకు పరిణామాల గురించి అభిప్రాయ సేకరణ చేసింది.

వాళ్ళు చెప్పిన ప్రకారం అసలు ముఖేష్ అంబానీ చెప్పింది ప్రతి కొత్త సినిమాకు వర్తిస్తుందా లేక కేవలం ఒప్పందానికి ఇష్టపడే నిర్మాతలకు మాత్రమేనా అనే క్లారిటీ రావాలని అప్పటిదాకా దీని గురించి కంక్లూజన్ కు రాలేమని అంటున్నారు. అంతే కాదు పెద్ద సౌండ్ సిస్టం తో హోం ధియేటర్లు ఉన్న వినియోగదారులు తక్కువ సంఖ్యలో ఉన్నారని పైగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇంట్లో రావడం అసాధ్యమని అందుకే దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని కూడా అంటున్నారు.

పైగా ఇందులో ప్రాక్టికల్ గా చాలా సమస్యలు ఉంటాయని వినడానికి ప్రకటనగా బాగుందని అమలులోకి వచ్చాక చూడమని కొందరు సెలవిచ్చారు. ముఖేష్ ఉద్దేశం ఏదైనా నిర్మాతల అంగీకారం లేనిదే నేరుగా హోం ధియేటర్లో సినిమా ప్రసారం సాధ్యం కాదు కాబట్టి దీని గురించి ఇంత కన్నా చర్చ అవసరం లేదని ఓ సీనియర్ నిర్మాత ముక్తాయింపు ఇవ్వడం విశేషం