Begin typing your search above and press return to search.

హాట్ సీన్లు అన్ని అలానే ఉన్నాయట

By:  Tupaki Desk   |   23 Oct 2016 11:30 AM GMT
హాట్ సీన్లు అన్ని అలానే ఉన్నాయట
X
ఐష్ అందాలతో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్రం.. పాక్ కళాకారులు ఈ చిత్రంలో నటించటంతో మరో తరహా వివాదానికి కేంద్రబిందువైంది. రణబీర్ కపూర్ తో చేసిన హాట్ హాట్ సీన్లకు సెన్సార్ సభ్యులు సైతం సిగ్గుపడినట్లుగా కొందరు చెబుతున్న వేళ.. అలాంటిదేమీ లేదంటూ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ చెబుతున్నారు. ఇదిలా ఉన్న వేళలో.. ఈ సినిమాను ప్రదర్శించేందుకు తాము ఒప్పుకునేదే లేదని రాజ్ ఠాక్రే ఫర్మానా జారీ చేయటంతో.. ఆయన్ను ఒప్పించి.. విడుదలకు అడ్డంకులు లేకుండా చేసుకోవటం కోసం కరణ్ జోహార్ పడిన పాట్లు అన్నిఇన్ని కావు.

రిలీజ్ కు సంబంధించిన సందేహాలు ఇప్పుడు లేని వేళ.. కొన్ని చీకాకులు ఎదురవుతున్నా.. వాటిని విడుదల తేదీ నాటికి సెట్ చేసుకోగలనన్న నమ్మకాన్ని కరణ్ వ్యక్తం చేస్తున్నారు. దీంతో..రాజకీయాల్ని వదిలేసి.. ఈ చిత్ర ప్రమోషన్ మీద కాస్త ఫోకస్ చేశారు. తాజాగా.. ఐష్.. అనుష్కా శర్మ.. హీరో రణబీర్ కపూర్ తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఈ సినిమాలో రణ్ బీర్.. ఐష్ మధ్య ఉండే హాట్ సన్నివేశాలకు కత్తెర పడ్డాయన్న ప్రశ్నకు లేదంటే లేదన్న మాటను కరణ్ చెప్పేశారు. కథకు అనుగుణంగా వచ్చే ఈ సీన్లను సెన్సార్ సభ్యులు అర్థం చేసుకున్నారని చెప్పిన ఆయన.. సెన్సార్ కత్తెర పడలేదని.. వారిద్దరి మధ్య హాట్ సీన్లు యథాతధంగా ఉన్నట్లుగా వెల్లడించారు. సెన్సార్ కారణంగా చాలానే మిష్ అవుతామని నిరాశ చెందే వారికి.. కరణ్ తాజా మాటలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయనటంలో సందేహం లేదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/