Begin typing your search above and press return to search.

బ‌న్నీ స‌ర్‌ ప్రైజ్ ఇంట‌ర్వెల్‌ లోనే!

By:  Tupaki Desk   |   22 March 2017 8:44 AM GMT
బ‌న్నీ స‌ర్‌ ప్రైజ్ ఇంట‌ర్వెల్‌ లోనే!
X
ఇంట‌ర్వెల్ సీక్వెన్స్ అంటేనే అక్క‌డ ఓ స‌ర్‌ ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంద‌ని అర్థం. ఇక సినిమా స్టార్ హీరోదే అయితే ఆ ఎలిమెంట్ మ‌రింత బ‌లంగా ఉంటుంది. అక్క‌డిదాకా సాగిన సినిమా ఒకెత్తు, ఆ త‌ర్వాత నుంచి సినిమా మ‌రో ఎత్తు. అందుకే ద‌ర్శ‌కులు ఇంట‌ర్వెల్‌ ని ఓ క్లైమాక్స్ రేంజిలో తెర‌కెక్కిస్తుంటారు. మంచి స‌ర్‌ ఫ్రైజింగ్ ఎలిమెంట్‌ ని అక్క‌డ ప్లాన్ చేస్తుంటారు. బ‌న్నీ సినిమా `డీజే`లో కూడా ఇంట‌ర్వెల్ సీన్ అదిరిపోతుంద‌ట‌. ఆ సీన్ ఏంట‌న్న‌ది కూడా బ‌య‌టికొచ్చింది. డీజే అలియాస్ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ కి కోప‌మొస్తే ఎలా ఉంటుంద‌నే అంశంతోనే ఇంట‌ర్వెల్ సీక్వెన్స్ ఉంటుంద‌ట‌.

ఆ స‌న్నివేశాల్నే ఇప్పుడు హైద‌రాబాద్‌ లోని ఓ రైల్వేస్టేష‌న్‌ లో తెర‌కెక్కిస్తున్నారు. అప్ప‌టిదాకా స‌ర‌దాగా క‌నిపించిన డీజే, ఇంట‌ర్వెల్ స‌మ‌యంలో జ‌రిగే ఓ ఇన్సిడెంట్ నుంచి ఎలా విజృంభిస్తాడనేది తెర‌పైనే చూడాలంటోంది చిత్ర యూనిట్‌. దీన్నిబ‌ట్టి అర్థ‌మ‌వుతున్న‌దేంటంటే తొలి స‌గ‌భాగం సినిమా అంతా బ‌న్నీ ఓ బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా స‌ర‌దాగా స‌ర‌దాగా క‌నిపిస్తూ వినోదాలు పంచిపెడ‌తాడ‌ని.... ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ నుంచి ఆయ‌న తీరు మారిపోతుంద‌ని! హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఈ వేస‌విలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇందులో బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/