Begin typing your search above and press return to search.

డిజె మీద కాన్ఫిడెన్స్ లేదా?

By:  Tupaki Desk   |   22 Jun 2017 7:41 AM GMT
డిజె మీద కాన్ఫిడెన్స్ లేదా?
X
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాధం రిలీజ్ కు ఇంకా కొన్ని గంటలే టైం ఉంది. ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించి ఆసక్తిగానే ఎదురుచూస్తోంది. బాహుబలి2 తర్వాత వస్తున్న పెద్ద చిత్రం కావడంతో.. థియేటర్ల జనాలు కూడా డీజేపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.

కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రచార హంగామా చూస్తే.. మూవీపై సినిమా యూనిట్ కి అంతగా నమ్మకం లేదేమో అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ముఖ్యంగా బన్నీ మరీ యాక్టివ్ గా ప్రచారం చేస్తుండడం చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నది వారి వాదన. పైగా మూవీ రిలీజ్ కి ముందు తిరుపతి వెళ్లడం చూస్తే ఆ డౌట్స్ మరిన్ని పెరిగిపోతున్నాయట. అలాగే ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరు కూడా వెళ్లాడు అల్లు అర్జున్. సాధారణంగానే తెలుగు సినిమాలు అక్కడ పిచ్చపిచ్చగా ఆడేస్తాయి. పైగా మెగా హీరోలకు అక్కడ ఫాలోయింగ్ బాగా ఎక్కువే. అయినా సరే బన్నీ బెంగళూరు ట్రిప్ పెట్టుకోవడాన్ని ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.

మూవీ ఔట్ పుట్ మీద యూనిట్ గా అంతగా కాన్ఫిడెన్స్ లేదేమో అని గుసగుసలాడేసుకుంటున్నారు. పైగా డీజే మూవీ క్లైమాక్స్ ను బన్నీ రీరైట్ చేయించాడనే టాక్ ఉండనే ఉంది. దాన్ని ఇప్పుడు పాయింట్ చేసి చూపిస్తూ.. డీజే రిజల్ట్ పై యూనిట్ కి నమ్మకం లేదేమో అని ఇండస్ట్రీ జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వీటికి సమాధానం.. కొన్ని గంటల్లోనే తెలిసిపోతుందిలే!