దవడ పన్ను చేతికొచ్చేలా బంతిని కొట్టారు

Mon Apr 15 2019 20:53:03 GMT+0530 (IST)

క్రికెట్ ఆడాలంటే ఒక పెద్ద మైదానమే కావాలి. గ్రౌండ్ సరిగా లేకపోతే ఆడేందుకు మూడ్ రాదు. కానీ అలాంటి అవసరమే లేకుండా ఏకంగా టీవీ లైవ్ లో లక్షలాది మంది వీక్షిస్తుండగా ఒక ప్రీరిలీజ్ వేడుకలో క్రికెట్ ఆడడం అన్నది బహుశా టాలీవుడ్ హిస్టరీలో ఇదే తొలిసారి అనడంలో సందేహమే లేదు. ప్రయత్నం కొత్తగానే ఉంది. ఆటతో పాటు బోలెడంత వినోదం - ఫన్ కుదిరింది. మొత్తానికి `జెర్సీ` ప్రీరిలీజ్ వేడుకను కొత్తగానే ప్లాన్ చేసింది టీమ్. ఇక సుమ లాంటి ట్యాలెంటెడ్ యాంకర్ ఈ ఈవెంట్ కి హోస్టింగ్ చేయడం.. ఏకంగా ప్యాడ్లు కట్టుకుని మరీ వేదికపై దిగిపోవడం ఇంట్రెస్టింగ్. దవడ పన్ను చేతికొచ్చేలా బంతిని కొట్టారు అంటూ కామెంట్రీని అదరగొట్టేశారు సుమ.అతిధులతో బ్యాటింగ్ బౌలింగ్.. చేయిస్తూ గ్యాలరీలో ఆడియెన్ నే ఫీల్డర్లుగా మార్చిన సుమ ఛాతుర్యానికి మెచ్చుకోవాలి. వచ్చిన ప్రతి అతిదీ ఇంతకుముందు క్రికెట్ ఆడారో లేదో తెలీదు కానీ - ఈ వేదికపై మాత్రం బాగానే ఆడుతున్నారు. అలా గెస్ట్స్ బ్యాటింగ్ చేస్తుంటే గ్యాలరీలో ఆడియెన్ క్యాచ్ లు పడుతున్నారు. అలా క్యాచ్ పట్టిన ఆడియెన్ ఒక్కొక్కరూ నాలుగు జెర్సీ టిక్కెట్లు గెలుచుకోవడం అన్న కాన్సెప్టు ఆసక్తికరం.

మొత్తానికి వేదికపై ఎవరెవరు బంతాట ఆడారు? అంటే.. నాని తొలి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ నాని గ్యాంగ్ లీడర్ దర్శకుడు సుధీర్ వర్మ - వెంకీ కుడుముల - విక్రమ్.కె.కుమార్ లాంటి టాప్ సెలబ్రిటీలు ఆట ఆడారు. ఇక వీళ్లు ఆడిన ఆట ఆద్యంతం వెంకీ మామ (ముఖ్య అతిధి.. క్రికెట్ వీరాభిమాని) గ్యాలరీలో కూచుని బిగ్ బాబుల్ నములుతూ ఒక ఆటగాడిలా ఫీలై.. చాలా బాగానే ఆస్వాధించారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ .. ఇంద్రగంటి 6 కొట్టారు.. వెంకీ కుడుముల 6కొట్టారు..  శిల్పకళా వేదిక టాప్ గ్యాలరీలోకి.. బోలెడన్ని సిక్సర్లు పడ్డాయి. మొత్తానికి ఆటతో జెర్సీ టీమ్ రక్తి కట్టించారు. అంతకుమించి వేదికపై బ్యూటిఫుల్ ఛీర్ లీడర్స్ వేడెక్కించారు.

వేదికపై నాని తొలి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ..``నానీ నాకు ఎంతో స్పెషల్ .. 2008లో ఆర్జేగా పని చేసిన ఒక కుర్రాడు `అష్టా చెమ్మా` ఆడిషన్స్ కోసం మా ఆఫీస్ కి వచ్చాడు. తర్వాత ఈమెయిల్స్ పంపాన``ని తెలిపారు.. ``నానీ నువ్వు స్టార్ మెటీరియల్.. దాదాపు దశాబ్ధం తర్వాత నా ప్రెడిక్షన్ కరెక్ట్ అవ్వడం గర్వంగా ఉంది. ఈ సినిమా నాకు చాలా క్లోజ్. నేను గతంలో గోల్కొండ హైస్కూల్ తీశాను ఆటల బ్యాక్ డ్రాప్ మూవీ అది. మళ్లీ ఇప్పుడు జెర్సీ టీమ్ ఆ సినిమాని గుర్తు చేస్తోంది. జెర్సీ పెద్ద విజయం సాధిస్తుంది`` అన్నారు. నానీ ఈ సినిమా కథ గురించి చెబుతున్నప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యానని తెరపై చూసేందుకు ఆసక్తిగా ఉన్నానని విక్రమ్.కె.కుమార్ వేదికపై అన్నారు. క్రికెట్ ఆట తనకు ఎంతో ఇష్టమని వెంకీ కుడుముల ఎగ్జయిట్ అవ్వడం ఆసక్తికరం.