Begin typing your search above and press return to search.

ఇంద్రగంటి మళ్లీ వైవిధ్యమే!!

By:  Tupaki Desk   |   20 Feb 2017 9:02 AM GMT
ఇంద్రగంటి మళ్లీ వైవిధ్యమే!!
X
సినిమాలు తీయడంలో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ చూపించే వైవిధ్యం అందరికీ సాధ్యం కాదు. రీసెంట్ గా నానితో జెంటిల్మన్ మూవీ తీసిన ఈయన.. మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడు. స్పీడ్ చూపించేస్తున్నాడు. అష్టాచెమ్మాతో నానిని ఇంద్రగంటి ఇండస్ట్రీకి పరిచయం చేయగా.. అదే నాని ఈయనకు బ్రేక్ ఇచ్చాడు. అదే అష్టాచెమ్మాలో మూవీతో పరిచయమైన మరో నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా.. ఇప్పుడో మూవీ చేస్తున్నాడీ దర్శకుడు.

ఈ సినిమాలో అవసరాలతో పాటు.. మరో హీరో అడివి శేష్ కూడా నటిస్తుండడం విశేషం. ఈ మూవీని పూర్తిగా తెలుగు నటులతోనే తీసేలా ప్లాన్ చేశాడట ఇంద్రగంటి. ప్రతీ పాత్రకు పక్క భాషల నటులను వెతుక్కొచ్చుకునే రోజుల్లో.. ఇలా అన్ని పాత్రలను కేవలం తెలుగువారితో మాత్రమే తీయాలని భావించడం లోనే ఇంద్రగంటి చూపే వైవిధ్యం అర్ధమవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఈషా.. అదితి.. అనే తెలుగమ్మాయిలే కనిపించబోతున్నారుయ

ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ.. ఫుల్ లెంగ్త్ ఎంటర్టెయిన్మెంట్ జోనర్ లో సాగనుందని తెలుస్తోంది. ఇప్పటికే హీరోయిన్లతో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా.. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభిస్తామని.. వేగంగా మూవీని పూర్తి చేస్తామని అంటున్నాడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/