Begin typing your search above and press return to search.

ముచ్చటగా మూడోసారి నానితో

By:  Tupaki Desk   |   10 July 2018 6:07 AM GMT
ముచ్చటగా మూడోసారి నానితో
X
న్యాచురల్ స్టార్ నాని ఒకవైపు సినిమాలతో పాటు బిగ్ బాస్ 2ని బాలన్స్ చేసుకుంటూ భలే అనిపించుకుంటున్నాడు. ఈ ఏడాది కృష్ణార్జున యుద్ధం రూపంలో ఒక షాక్ తిన్న నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి చేస్తున్న దేవదాస్ మీద ఫుల్ హోప్స్ తో ఉన్నాడు. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ తనకు మరో బ్రేక్ అవుతుందని ఫాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే సెన్సిబుల్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తెరకెక్కిస్తాడని పేరున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో నాని త్వరలో మరో సినిమా చేసే అవకాశం ఉంది. ఇంద్రగంటి అంటే నానికి ప్రత్యేకమైన అభిమానం. టాలీవుడ్ లో తనకు మొదటి బ్రేక్ ఇచ్చిన అష్టాచెమ్మాకు డ్యూయల్ రోల్ మొదటి సారి చేయించి సూపర్ హిట్ ఇచ్చిన జెంటిల్ మెన్ కు ఆయనే దర్శకుడు కనక. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రావొచ్చని గత ఏడాదే వార్తలు వచ్చాయి కానీ సరైన కథ సెట్ కాకపోవడంతో ఆలస్యమవుతూ ఫైనల్ గా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.

దీన్ని సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు తెరకెక్కించనున్నారు. ఆ మధ్య నిర్మాణానికి కొంత కాలం దూరంగా ఉన్న కెఎస్ రామారావు తేజ్ ఐ లవ్ యు నుంచి ఇక పై క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వరసగా సినిమాలు వస్తాయని ప్రకటించారు. అందులో భాగంగానే ఇంద్రగంటి-నాని కాంబోని సెట్ చేసుకున్నట్టు తెలిసింది. ఇటీవలే సుధీర్ బాబు కు సమ్మోహనం లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన ఇంద్రగంటి నాని కోసం ఎలాంటి కథను సిద్ధం చేసుంటాడా అనే ఆసక్తి మొదలైంది. జెంటిల్ మెన్ లో విభిన్నమైన క్రైమ్ జానర్ ను టచ్ చేసిన ఇంద్రగంటి ఈ సారి ఎంటర్ టైనర్ వైపు మొగ్గు చూపేలా కనిపిస్తోంది. నాని ప్రస్తుతం ఎలాగూ బిజీగా ఉన్నాడు కాబట్టి అతను ఫ్రీ అయ్యే లోపు పక్కా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట ఇంద్రగంటి. సో మరోసారి క్రేజీ కాంబోకు తెరలేవబోతోందన్న మాట.