Begin typing your search above and press return to search.

'సమ్మోహన'పరచనున్న సుధీర్

By:  Tupaki Desk   |   22 Feb 2018 12:57 PM GMT
సమ్మోహనపరచనున్న సుధీర్
X
మహేష్ బాబు కి చుట్టం లాగా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయినప్పటికీ, తన కంటూ ఒక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు సుధీర్ బాబు. ఏం మాయ చేసావే లో చిన్న పాత్ర చేసినా ఎస్.ఎం.ఎస్ సినిమా తో హీరో అయిపోయాడు.

ప్రేమ కథ చిత్రం తో తొలి హిట్ ను నమోదు చేసుకున్న హీరో మిగతా సినిమా లతో పెద్దగా మెప్పించలేకపోయాడు. శమంతక మణి తో యావరేజ్ మార్కులు వేయించుకున్న సుధీర్ ఇప్పుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. టైటిల్ తోనే మన అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు సుధీర్. సమ్మోహనం పేరుతో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులలో బాగానే నోట్ అయిపోయింది. అదితి రావు హైదారి ఇందులో మొదటి సారిగా సుధీర్ పక్కన నటించబోతోంది.

హిందీ లో కెరీర్ బాగానే నడుస్తున్నా తెలుగు లో మాత్రం ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది ఈ సుందరి. ఇంద్రగంటి కూడా అమీ తుమీ లాంటి సినిమా తర్వాత చేయబోతున్న సినిమా కాబట్టి తప్పకుండా హిట్ అవుతుంది అని సుధీర్ మరియు అదితి బోలెడు ఆశలు పెట్టుకున్నారు.