Begin typing your search above and press return to search.

వాళ్లిద్దరూ ఓకే.. వీళ్లకి ఝలక్ తగిలింది

By:  Tupaki Desk   |   20 Oct 2016 3:30 AM GMT
వాళ్లిద్దరూ ఓకే.. వీళ్లకి ఝలక్ తగిలింది
X
సౌత్ లోనో.. రీజనల్ గానో పేరు తెచ్చుకున్న చాలామంది బాలీవుడ్ కలలు కనేస్తూ ఉంటారు. హీరోయిన్లకు ఎక్కువగాను.. హీరోలకు కాస్త తక్కువగాను ఈ డ్రీమ్స్ బయటపడుతుంటాయి. అయితే బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న తారలు.. హాలీవుడ్ కలలు డ్రీమ్స్ లో మునుగుతూ ఉంటారు. ఇప్పుడంటే క్వాంటికో సీరియల్-బేవాచ్ మూవీతో ప్రియాంక చోప్రా.. ట్రిపుల్ ఎక్స్ మూవీతో దీపికా పదుకొనేలకు హాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ వచ్చింది కానీ.. గతంలో కొంతమంది స్టార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసి ఝలక్ తినేశారు.

బాలీవుడ్ లో వెలిగిపోతున్న శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. కిక్ తో పేరు సంపాదించే సమయానికి.. ఓ హాలీవుడ్ సినిమా చేసింది. 'డెఫినిషన్ ఆఫ్ ఫియర్' అనే మూవీలో సైకాలజీ స్టూడెంట్ గా నటించింది కానీ.. ఇది ఎక్కడా రిలీజ్ కాలేదు. ఫిలిం ఫెస్టివల్స్ లో మాత్రం ప్రదర్శనల కోసం చక్కర్లు కొడుతోందనే మాట వినిపించిందంతే. ఈ లోగా జాక్వెలిన్ మాత్రం బాలీవుడ్ లో జెండా పాతేసింది.

ఇమ్రాన్ హష్మీ కూడా టైగర్స్ అంటూ ఓ సినిమా చేశాడు. ఆస్కార్ విన్నర్ డానిస్ టనోవిక్ దర్శకత్వంలో కావడంతో.. అనురాగ్ కశ్యప్ ఓ నిర్మాత కావడం లాంటి చాలానే హైలైట్స్ ఉంటాయ్. టొరంటో ఫిలిం ఫెస్టివల్ 2014లో ప్రదర్శితమైన ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకపోవడానికి కారణం.. ఓ ఫార్మా కంపెనీలో పని చేసే సేల్స్ మేన్ పై తీసిన కాంట్రవర్సియల్ కథ కావడమే.

సౌత్ హీరో మాధవన్ 'నైట్ ఆఫ్ ద లివింగ్ డెడ్: డార్కెస్ట్ డాన్' అనే సినిమా చేశాడు. 2009లో మొదలైన ఈ చిత్రం న్యూయార్క్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఇరుక్కుపోయిన వ్యక్తిపై తీసిన హారర్ మూవీ. రకరకాల మలుపులు తిరిగి.. చివరకు ఓ 60నిమిషాల యానిమేటెడ్ సిరీస్ గా బయటకొచ్చిందంతే. అదికూడా సూపర్ ఫ్లాప్ అయింది.

బిపాషా బసు 'సింగ్యులారిటీ' అనే సినిమా హాలీవుడ్ మూవీలో నటించింది. స్వతంత్రం రాకముందు ఇండియాలో జరిగిన కథాంశంపై టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తీశారు. తర్వాత పేరు మార్చి ది లవర్స్ అంటూ కంటిన్యూ చేశారు. అయినా రిలీజ్ కి నోచుకోలేదు. చివరకు మళ్లీ పేరు మార్చి 'టైమ్ ట్రావెలర్' అంటూ డీవీడీల రూపంలో యూకే వరకూ విడుదలైందంతే.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మన మెగాస్టార్ చిరంజీవి కూడా.. అప్పట్లో ఓ హాలీవుడ్ మూవీ మొదలుపెట్టేశారు. 'అబు.. ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్' అంటూ పెద్ద ట్రయల్ వేశారు. తెలుగులో అబు.. బాగ్దాద్ గజదొంగ అని రిలీజ్ అవుతుందన్నారు. ఒకట్రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేశాక.. అడ్రస్ లేకుండా పోయిందీ సినిమా. అలా చాలామంది హాలీవుడ్ కలలు కల్లలయ్యాయ్ మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/