రూమర్స్ కి అందంగా చెక్ పెట్టేసిందిగా..

Wed Jun 13 2018 20:30:40 GMT+0530 (IST)

నాజూకు నడుము అందం అంటే ఏంటో.. టాలీవుడ్ జనాలకు మొదట ఇలియానాను చూసిన తరువాతే తెలిసింది. అమ్మడు ఇచ్చే సెక్సీ లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవదాసు సినిమాతో పదేళ్ల క్రితమే రచ్చ చేసి కుర్రకారు గుండెల్లో ఓ ముద్ర వేసి పోయింది. కొన్నేళ్ల వరకు ఇక్కడ బాగానే ఉన్నా బాలీవుడ్ పిలవగానే అక్కడికి వెళ్లిపోయింది. అమ్మడు అక్కడ ఇచ్చిన హాట్ ఫోజులకు అందరూ స్టన్ అయ్యారనే చెప్పాలి.బికినిలో కనిపించడంతో తెలుగు ఆడియెన్స్ కూడా అమ్మడి బాలీవుడ్ లుక్స్ ని ఇష్టపడ్డారు. ఇకపోతే చాలా కాలం తరువాత ఇల్లి తెలుగు సినిమా జేయడానికి ఒప్పుకుంది. గతంలో కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా తనకు నచ్చిన క్యారెక్టర్స్ రాకపోవడంతో ఒకే చేయడానికి ఆలస్యం అయ్యింది. ఇక నెక్స్ట్ రవితేజ అమర్ అక్బర్ అంథోని లో నటించడానికి ఒప్పుకుంది. అయితే ఇటీవల ఇలియానా కొంచెం బొద్దుగా అయ్యింది అనే ఒక టాక్ వచ్చింది. ఆ రూమర్స్ కి అమ్మడు ఒక క్లిప్పింగ్ తో చెక్ పెట్టింది.

కాస్త కండ పెరిగినప్పటికీ వయ్యారాలను సమపాళ్లలో కవర్ చేసుకుంది. బికినీ లుక్ లో అదిరిపోయిందనే చెప్పాలి. మొత్తానికి ఇల్లి మళ్లీ టాలీవుడ్ జనాల్లో మరో ముద్ర వేస్తుందని ఒక టాక్ పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫిజి ద్వీపంలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రదేశాలకు ప్రచారాలను కల్పిస్తూ నిరంతరం కృషి చేస్తోంది. ఎక్కువగా తన హాట్ ఫొటోలతో ఆకర్షిస్తుందని చెప్పాలి.