Begin typing your search above and press return to search.

హమ్మయ్యా.. ఇల్లీ రంగేసుకుంది

By:  Tupaki Desk   |   10 Feb 2016 1:30 PM GMT
హమ్మయ్యా.. ఇల్లీ రంగేసుకుంది
X
పాపం ఇలియానా. ఈ నడుం సోయగం పరిస్తితి ఏమంత బాగోలేదు. నోటి వరకు వచ్చిన ఛాన్సులన్నీ లాస్ట్‌ మినిట్‌ లో ఆవిరైపోతున్నాయి. ఒక్కరు కూడా అమ్మడిపై జాలి చూపించట్లేదు. బాలీవుడ్‌ చెక్కేసి నాలుగైదు సినిమాల్లో మెరిసినా కూడా.. అక్కడ క్రేజ్‌ రాకపోవడం సరే.. అసలు చేతిలో ఛాన్సులే లేకుండా పోయాయ్‌. అంతేకాదు.. మ్యాగజైన్లలో బికినీల్లో తన అందాలు ఆరబోసినా.. సోషల్‌ నెట్వర్క్‌ లో తన సెల్ఫీలతో నానా రచ్చ చేసినా.. బాయ్‌ ఫ్రెండ్‌ ఆండ్రూ గురించి మీడియాకు ఎన్ని లీకులు ఇచ్చినా.. ఇలియానా కనీసం ఒక పాపులర్‌ న్యూస్‌ ఐటెం కూడా కాలేకపోయింది.

ఎట్టకేలకు ఫ్లాపు హీరోయిన్లను కాస్త బాగా ఎంకరేజ్‌ చేసే హీరో అక్షయ్‌ కుమార్‌ మాత్రం అమ్మడికి ఒక ఛాన్సిచ్చాడు. బేబి - స్పెషల్ చబ్బీస్‌ వంటి సినిమాలను అక్షయ్‌ తో తీసిన దర్శకుడు నీరజ్‌ పాండే.. ఇప్పుడు ''రుస్తుం'' అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఇల్లీని తీసుకున్నారు. అయితే ఇది పాత న్యూసే. కాని ఎప్పటిలాగానే ఇది కూడా గోవా గాళ్‌ చేతినుండి స్లిప్‌ అవుతుందేమో అంటూ అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తుంటే.. అమ్మడు మాత్రం సింపుల్‌ గా ముఖానికి రంగేసుకుని ముంబయ్‌ లోని ఒక స్టూడియోలో షూటింగ్‌ లో పాల్గొంటోంది. అమ్మడి ఫ్యాన్స్‌ కు ఇంతకంటే స్వీట్‌ కబురు ఏం కావాలి.