Begin typing your search above and press return to search.

50 వ‌య‌సులో 6ప్యాక్ ఏంటో!?

By:  Tupaki Desk   |   11 Nov 2018 4:29 AM GMT
50 వ‌య‌సులో 6ప్యాక్ ఏంటో!?
X
దాదాపు ఆరేళ్ల త‌ర్వాత స‌న్న‌జాజి సోయ‌గం ఇలియానా టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` చిత్రంతో పున‌ప్ర‌వేశం చేస్తోంది. ర‌వితేజ‌ - శ్రీ‌నువైట్ల సాన్నిహిత్యం ఈ భామ రీఎంట్రీకి క‌లిసొచ్చింది. నిన్న‌టి సాయంత్రం `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` ప్రీరిలీజ్ వేదిక‌కు ఇలియానా గ్లామ‌ర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఈ వేదిక‌ పై ఊహించ‌ని ఓ ట్విస్టు. అదంతా శ్రీ‌నువైట్ల ఫాల్ట్ అంటూ ఇలియానా కాస్త ఎగ్జ‌యిట్‌మెంట్ పెంచింది.

అస‌లింత‌కీ వైట్ల‌ ఫాల్ట్ ఏంటి? అంటే.. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో తొలిసారి ఇలియానాతో డ‌బ్బింగ్ చెప్పించాడ‌ట‌. త‌నతో తెలుగు డ‌బ్బింగ్ చెప్పించాల‌నుకోవ‌డం శ్రీ‌నూవైట్ల ఫాల్ట్ అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది. కానీ ఇదో గొప్ప అనుభ‌వం. నేను తెలుగు డ‌బ్బింగ్ బాగానే చెప్పాన‌ని అనుకుంటున్నా. ఆ ప్ర‌శంస‌ను శ్రీ‌నువైట్ల నుంచి .. ఆడియెన్ నుంచి వినాల‌నుంది.. అంటూ చిలిపిగా న‌వ్వేసింది.

ర‌వితేజతో సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ.. మ‌స్ రాజా నాకు మంచి స్నేహితుడు. అత‌డి ఎన‌ర్జీ ఈ సినిమాలో నెక్ట్స్ లెవ‌ల్లో ఉంటుంది. త‌న‌తో క‌లిసి ఇదివ‌ర‌కూ న‌టించ‌డం వ‌ల్ల నాకు సెట్స్‌లో ఎంతో సౌక‌ర్యంగా అనిపించింది. త‌న‌తో ఛాన్సులు వ‌స్తే మ‌రిన్ని సినిమాల్లో న‌టిస్తాను.. అని చెప్పింది. ఈ సినిమా కోసం 50 వ‌య‌సులో ర‌వితేజ చేసిన సాహ‌సానికి సంబంధించిన‌ గుట్టును ఇలియానా లీక్ చేసింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఈ సినిమాలో చొక్కా విప్పి 6-ప్యాక్ చూపించ‌బోతున్నార‌నే టాప్ సీక్రెట్‌ని వేదిక‌ పై ఇలియానా రివీల్ చేసింది. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని భారీ చిత్రం.. త‌న‌కు ఎంతో స్పెష‌ల్ అని చెప్పుకొచ్చింది.