Begin typing your search above and press return to search.

ఇల్లి అందాలపై ఫ్లాషెస్ దాడి!!

By:  Tupaki Desk   |   26 Sep 2017 10:29 AM GMT
ఇల్లి అందాలపై ఫ్లాషెస్ దాడి!!
X

దేవదాసు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి దాదాపు టాలీవుడ్ హీరోలందరితో ఆడిపాడిన ముద్దుగుమ్మ ఇలియానా. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే అమ్మడి అందం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్ లో తన నడుముతో కుర్రకారుకు మతి పోగొట్టేలా చేసింది. కానీ టాలీవుడ్ లో బోర్ కొట్టిందనుకుందో ఏమో గాని బాలీవుడ్ కి వెళ్లి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఇలియానా సినిమాల్లోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లవుతోంది. అమ్మడి వయసు ఇప్పుడు 30 అయినా కూడా అందాన్ని చెక్కు చెదరనివ్వలేదు. ఎక్కడ దర్శనమిచ్చినా అదే స్మైల్ తో సెక్సీగా పోజులను ఇస్తోంది. రకరకాల డ్రెస్సులతో కనిపించి కెమెరాలకు పని చెబుతోంది. రీసెంట్ గా ఇదే తరహాలో ఇలియానా బ్లాక్ డ్రెస్సులో కనిపించింది. ముంబై లోని ఓ రెస్టారెంట్ కి వెళ్లిన ఇల్లి క్లివేజ్ షోతో అందరిని షాక్ కి గురి చేసింది.

నిండుగా డ్రెస్ వేసుకున్నట్టే వేసుకొని క్లివేజ్ షో ఎక్కువ ఉండడంతో కెమెరాలు ఉరుకుంటాయా? అన్ని ఫ్లాష్ లు ఆమె అందంపై వెలుగులతో దాడి చేశాయి. కానీ ఇల్లి మాత్రం ఏమనకుండా సైలెంట్ గా స్మైల్ ఇస్తూ వెళ్ళింది. అమ్మడు రీసెంట్ గా బాద్షాహో సినిమాలో ఘాటుగా కనిపించి చాలా ఫెమస్ అయ్యింది. సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. ప్రస్తుతం రైడ్ అనే మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.