Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బార్బీ గర్ల్ ఇలియానా

By:  Tupaki Desk   |   13 Sep 2017 4:30 AM GMT
ఫోటో స్టోరి: బార్బీ గర్ల్ ఇలియానా
X
నాజూకు నడుముతో సౌత్ ని ఒక ఊపు ఊపిన ఇలియానాని మర్చిపోవడం ఎవ్వరి తరం కాదు. ఎందుకంటే అమ్మడు టాలీవుడ్ లో చూపించిన అందాలు అన్ని ఇన్ని కావు. సినిమాకొక లుక్ తో కనిపించి తెలుగు కుర్రకారును ఉక్కిరిబిక్కరి చేసింది. అప్పట్లో కేవలం ఇల్లీ నటిస్తుందని థియేటర్స్ వరకు వెళ్లిన వారి సంఖ్య బాగానే ఉండేది. అయితే అమ్మడు బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ రెచ్చిపోయి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కి పోటీని ఇస్తోంది.

అయితే రీసెంట్ గా ఇల్లీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. వినూత్న శైలిలో కాస్మోపొలిటన్ అనే మ్యాగజైన్ కవర్ పేజీపై సెక్సీ స్టిల్స్ ఇచ్చింది. ఇంతకుముందే చాలా సార్లు బికినీ లో కనిపించినా ఎందుకో గాని ఇల్లీ ఈ లుక్ లో ఇంకా బావుంది అంటున్నారు నెటీజన్స్ . అలాగే అమ్మడి హెయిర్ స్టైల్ కూడా చాలా కొత్తగా ఉంది. ముందు షర్ట్ బటన్స్ తీసేసి వయ్యారాలను తెగ వలకబోస్తోంది.ఇక మొత్తంగా ఇలియానాని నిల్చున్న ఆ ఫోజుని చూస్తుంటే బార్బీ గర్ల్ కి ఇలియానా పొలికలొస్తే ఇదే స్టైల్ లో ఉంటుంది అంటున్నారు ఆమె అభిమానులు.

ఇక ఇలియానా రీసెంట్ గా చేసిన 'బాద్షాహో' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళను బాగానే రాబట్టింది. అమ్మడి అందాలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. దీంతో ఇలియానా కి ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం అజయ్ దేవ్ గన్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రైడ్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా 2018లో రిలీజ్ కానుంది. అలాగే మరొక రెండు సినిమాలను కూడా అమ్మడు లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.