ఇలియానాను ఇసిగిస్తే ఇంతే మరి

Tue Mar 13 2018 21:42:54 GMT+0530 (IST)

ఏ విషయంలో అయినా కాస్త అటూ ఇటూ అయితే ఒప్పుకుంటారేమో కానీ.. తమ పేరు విషయంలో మాత్రం సెలబ్రిటీలు బాగా పట్టు పడతారు. అలాగే తమ హోదాను ఏ కొంచెం తక్కువ చేసినా అస్సలు తట్టుకోలేరు. ఒకే ఈవెంట్లో ఈ రెండు పాయింట్ల మీద.. ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు హర్ట్ చేస్తే.. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించేసింది గోవా బ్యూటీ ఇలియానా.ప్రస్తుతం రెయిడ్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది ఇల్లీ బేబీ. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ తో కలిసి పబ్లిసిటీ యాక్టివిటీస్ లో తెగ పార్టిసిపేట్ చేస్తోంది. ఓ కార్యక్రమంలో ఒక జర్నలిస్ట్ తెగ అత్యుత్సాహం చూపించేస్తూ.. 'ఇవాళ మనం సూపర్ స్టార్ అజయ్ దేవగన్.. ఇలియానా డిసౌజాలతో ఇక్కడ ఉన్నాం' అన్నాడు. ఇక్కడ ఇలియానా ఇంటి పేరు మార్చేయడమే కాదు.. హీరోకు సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చి.. ఇల్లీని మాత్రం ఏకవచనంలో సంబోధించాడని గుర్తుంచుకోవాలి. ఒకసారి ఇలా జరగగా అందరూ మిన్నకున్నారు.

కానీ ఇదే మాటను కాసేపటి తర్వాత రిపీట్ చేశాడు ఆ రిపోర్టర్. అంతే భళ్లున బద్దలైంది ఇలియానా ఆగ్రహం. నువ్వు ముందు కొంత హోంవర్క్ చేసి రావాల్సి ఉందని.. పేర్లను ఇలా మిక్స్ చేసేస్తుంటే చాలా చిరాగ్గా అనిపిస్తోందని చెప్పేసింది ఇలియానా. అంతే కాదు పేరుకు ముందు విశేషణాన్ని జోడించడం కూడా మర్యాద అనిపించుకుంటుందని.. చాలా మర్యాదగా ఆ రిపోర్టర్ కు సూటిగా చెప్పింది గోవా బ్యూటీ.