ఇల్లీ పాప బాగానే పిండేసిందట

Wed May 23 2018 21:31:38 GMT+0530 (IST)

టాలీవుడ్ లో కొన్నేళ్ల క్రితం టాప్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసింది ఇలియానా. కానీ ఇంతలోనే బాలీవుడ్ అవకాశాలు రావడం.. అరంగేట్రంలోనే మంచి హిట్ తో పాటు.. అందంగా ఉందని.. అలాగే యాక్టింగ్ బాగా చేసిందని గుర్తింపు కూడా రావడంతో.. అక్కడే సెటిల్ అయిపోయింది. ఆ మధ్య వరకు అడపాదడపా తెలుగులో కూడా నటించిన ఈ గోవా బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా మొహం చాటేసింది.అలాంటి సమయంలో రవితేజ- శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతోన్న అమర్-అక్బర్-ఆంటోనీ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించిందనే న్యూస్ వచ్చింది. రవితేజతో గతంలో కిక్ లాంటి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న ఈ భామ.. మళ్లీ కొన్నేళ్ల తర్వాత మాస్ మహరాజ్ తోనే రీఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే.. ఈ సినిమాలో నటించేందుకు అమ్మడు బాగానే పారితోషికం పుచ్చుకుంటోందట. ఈ చిత్రంలో ఇల్లీ పాత్రే కాస్త లెంగ్తీగా ఉంటుందట. షెడ్యూల్స్ ప్రకారం చూసుకుని.. ప్రమోషన్స్ కు కూడా కలిపి 2 కోట్ల రూపాయలు అడిగిందట ఇలియానా.

ప్రస్తుతం బాలీవుడ్ లో విజయాలతో దూసుకుపోతున్న ఈ భామకు 2 కోట్లు ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని అంటున్నారు. అలా టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుతో రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. గట్టి మొత్తమే గిట్టుబాటు చేసుకుంది ఇల్లీ.