Begin typing your search above and press return to search.

ఇలియానా చిత్రమైన పరిస్థితి.. ఇకపై ఎలాగో?

By:  Tupaki Desk   |   18 Nov 2018 12:03 PM GMT
ఇలియానా చిత్రమైన పరిస్థితి.. ఇకపై ఎలాగో?
X
టాలీవుడ్‌ లోకి ‘దేవదాస్‌’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు చిత్రాలతో సక్సెస్‌ లను దక్కించుకున్న ముద్దుగుమ్మ ఇలియానా టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ ను కూడా ఒక ఊపు ఊపేసింది. స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారిపోయి, అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌ గా కూడా గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్‌ గా మంచి ఫామ్‌ లో ఉన్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్‌ కు వెళ్లింది. తెలుగులో ఇలియానా చివరిగా ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో నటించింది. రవితేజ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అయినా కూడా ఇలియానాకు మంచి క్రేజ్‌ ఉంది. కాని బాలీవుడ్‌ కు వెళ్లి పోయి అక్కడ సెటిల్‌ అవ్వాలనుకుంది.

బాలీవుడ్‌ లో కొంత కాలం ఈమె హవా సాగింది. కాని కొంత కాలంకు ఆమెకు ఛాన్స్‌ లు తగ్గాయి. ఆ సమయంలో శ్రీనువైట్ల ఈమెకు ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో ఛాన్స్‌ ఇచ్చాడు. రవితేజ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమను వదిలేసిన ఇలియానా మళ్లీ రవితేజకు జోడీగా నటించి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్స్‌ లు కావడం కాకతాళీయమే అయినా కూడా టాలీవుడ్‌ లో ఆమె కెరీర్‌ కొనసాగడం కష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలియానా మునుపటితో పోల్చితే చాలా లావు అయ్యింది. అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమాకు ఇలియానా మైనస్‌ అయ్యిందనే వారు కూడా ఉన్నారు. దాంతో ఇలియానా కెరీర్‌ భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఇలియానా లుక్స్‌ పరంగా ఆకట్టుకుంటే ఆమెకు మంచి భవిష్యత్తు ఉండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇలియానాకు మరో ఛాన్స్‌ వస్తుందా లేదా అనేది చూడాలి. ఒక వేళ మరో ఛాన్స్‌ వస్తే ఈమె సద్వినియోగం చేసుకుంటుందా లేదా అనేది కూడా పెద్ద ప్రశ్న.