Begin typing your search above and press return to search.

ఇల్లీ బేబీకి ఏడాది పట్టిందిగా

By:  Tupaki Desk   |   30 Nov 2015 1:30 AM GMT
ఇల్లీ బేబీకి ఏడాది పట్టిందిగా
X
గోవా బ్యూటీ ఇలియానా తెరపై కనిపించి ఏడాది దాటిపోయింది. గతేడాది హ్యాపీ ఎండింగ్ అంటూ ఏమంటూ చేసిందో కానీ.. ఆ తర్వాత అమ్మడి కెరీర్ కి ఎండ్ పడిపోయిందేమో అనిపించింది. ఎందుకంటే ఏడాది పాటు ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు. అలాగే ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు.

సరిగ్గా ఏడాది తర్వాత ఇలియానాకి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. థ్రిలింగ్ రొమాంటిక్ మూవీతోపాటు.. మర్డర్ మిస్టరీ కూడా కలగలిసిన ఓ ప్రాజెక్ట్ ఇల్లీ బేబీ చేతికొచ్చింది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న "రుస్తుం"కు లీడ్ హీరోయిన్ గా ఎంపికైంది గోవా భామ. ఎ వెడ్నెస్ డే, స్పెషల్ 26, బేబీ వంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన నీరజ్ పాండే.. ఈ రుస్తుంకు నిర్మాణ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇది అక్షయ్, నీరజ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడం విశేషం.

ప్రస్తుతం అక్షయ్ చేస్తున్న ఎయిర్ లిఫ్ట్ మాదిరిగానే.. రుస్తుం కూడా గతంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తెరకెక్కనుండడం విశేషం. ఇది 1950 కాలంలో జరిగిన కథ. ఇందులో డాన్ తరహా రోల్ లో అక్షయ్ కుమార్ కనిపించనుండగా.. టిను దేశాయ్ డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. ఈషా గుప్తా నెగిటివ్ రోల్ చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇండియా, యూకే, యూరోప్ లలో నిర్వహించనున్నారు. మొత్తానికి ఏడాది తర్వాత ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో లీడ్ రోల్ రావడంతో.. ఇలియానా ఫుల్లు హ్యాపీగా ఉందిపుడు.