నడుం సుందరికీ ఆల్రెడీ పెళ్ళయ్యిందా?

Sat Oct 21 2017 23:04:11 GMT+0530 (IST)

సినిమా హీరోయిన్లు లవ్ లో పడితే వారు ఎంత సీక్రెట్ గా మెయింటేన్ చేసినా బయటపడుతోంది. అంతే కాకుండా వారి పెళ్లి ఎంత గోప్యంగా జరిగినా తెల్లారేసరికి మీడియాలో గోలగోలగా వినిపిస్తుంటోంది. సోషల్ మీడియా ప్రభావంతో ఈ విషయం సెకండ్స్ లో అభిమానులకు తెలిసిపోతోంది. ఇక తారల మీద ఏ మాత్రం అనుమానం వచ్చినా వారి ఫొటోస్ పైనే సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ మధ్య ఎక్కువగా ఒక న్యూస్ బాలీవుడ్ లోను అలాగే సౌత్ లో చాలా వైరల్ అయ్యింది. టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో వెండితెరకు పరిచయమైన నడుం సుందరి ఇలియానా అందరికి తెలిసిన హీరోయినే. కొన్నేళ్లు టాలీవుడ్ లో బాగానే రానించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే ఆమె గత కొంత కాలంగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమను కొనసాగిస్తోంది. అంతే కాకుండా బికినీ ఫొటోలతో అమ్మడు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకైతే మైండ్ బ్లాక్ అయ్యింది.

అసలు విషయానికి వస్తే అమ్మడు ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడో వివాహం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. పెళ్లి అయ్యిందని తెలిస్తే మళ్లీ కెరీర్ కి ఎఫెక్ట్ పడుతుందేమో అని అమ్మడు చాలా సీక్రెట్ గా వ్యవహరిస్తోందట. అంతే కాకుండా రీసెంట్ గా తన ఫ్రెండ్స్ తో ఫొటోస్ దిగినా ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అనుమానం కలిగేలా కామెంట్స్ చేసింది. ''నాలాగే మీరు కూడా మీ లైఫ్ లో  సగమయ్యే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి'' అని కామెంట్ పెట్టడంతో.. కొందరు ఆమెకు పెళ్లి ఎప్పుడో అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరో పోస్టులో.. ''నా బెటర్ హాఫ్ ఈ ఫోటో తీశాడు'' అని చెప్పడంతో.. మరి పెళ్ళికాకుండా లవ్వర్ ని బెటర్ హాఫ్ అని ఎవరూ పిలవరూ కదా అంటున్నారు జనులు. ఏమంటావ్ నడుం సుందరి?