Begin typing your search above and press return to search.

బీచ్ పూల్‌ లో ఎర్ర‌బికినీ క‌వ్వింత‌

By:  Tupaki Desk   |   14 Aug 2018 4:20 AM GMT
బీచ్ పూల్‌ లో ఎర్ర‌బికినీ క‌వ్వింత‌
X
బికినీల‌తో బీచ్‌ ని వేడెక్కించ‌డం ఇలియానాకు కొత్తేమీ కాదు. గోవా టు ఫిజీ ప్ర‌స్తుతం ఈ భామ బికినీ సెల‌బ్రేష‌న్స్‌ లో బిజీ బిజీగా ఉంటోంది. వీలున్న‌ప్పుడ‌ల్లా ఫిజీ దీవుల‌కు వెళ్లిపోయి అక్క‌డే బీచ్ లేక్ ఫెస్టివ‌ల్ చేసుకుంటోంది. ఫిజీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌ గా త‌న‌వంతు న్యాయం చేస్తోంది. ఇన్‌ స్టా - ట్విట్ట‌ర్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో నిరంత‌రం ఫిజీ గురించి త‌ప్ప వేరొక ధ్యాసే క‌నిపించ‌డం లేదు.

రీసెంటుగానే రిలీజైన ఫిజీ ప్ర‌చార చిత్రాల్లో ఇలియానా ఓ రేంజులో హొయ‌లు పోయింది. ఫిజీ టూరిజం కోసం బోలెడంత ప్ర‌చారం చేసింది. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌ళుక్కున బికినీలో మెరుస్తూ ఊపు తెచ్చింది. గ‌త నెల‌రోజులుగా ఈ ఫోటోషూట్‌ కి సంబంధించి ఒక్కో ఫోటోని ఇలియానా లీక్ చేస్తూనే ఉంది. తాజాగా రివీల్ చేసిన ఈ ఎర్ర‌బికినీ లుక్ ప‌క్కా టెంప్టింగ్‌ గా మ‌తిచెడగొడుతోంది.

చూడ‌గానే యూత్ గుండె ఖిల్లా గ‌ల్లంత‌యిపోవాల్సిందే. ఎరుపురంగు బికినీలో స్వేచ్ఛగా య‌థాలాపంగా చూస్తున్న ఈ భామ‌.., ఆ న‌ల్ల‌రంగు క‌ళ్ల‌ద్దానికి కాంబినేష‌న్ తెలుపు వైట్ ఫ్ల‌వ‌ర్‌ తో సూప‌ర్భ్‌ గా క‌నిపిస్తోంది. ఇలియానా జ‌ల‌కాలాట‌ల్ని కెమెరా లెన్స్‌ అంతే అందంగా క్యాచ్ చేసింది. ఈ షికార్లు పూర్త‌య్యాక ఇలియానా తిరిగి పూర్తిగా సినిమాల‌పై దృష్టి సారించింది. ప్ర‌స్తుతం ర‌వితేజ స‌ర‌స‌న `అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని` చిత్రంలో న‌టిస్తోంది. అలానే బాలీవుడ్ సినిమాల క‌థ‌ల్ని ప‌రిశీలిస్తోందిట‌.