ఫొటో స్టోరీ: బాత్ టబ్ లో బ్యూటీ

Tue Apr 17 2018 10:15:59 GMT+0530 (IST)

గోవా నుంచి టాలీవుడ్ కొచ్చి సన్నని నడము.. సోగ కళ్లు.. మత్తెక్కించే వయ్యారంతో మాయ చేసింది ఇలియానా. తెలుగులో కెరీర్ మొదలెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ టైటిల్ దక్కించేసుకుంది. కొన్నాళ్ల తరవాత టాలీవుడ్ బోర్ కొట్టేసిందంటూ బైబై చెప్పి ముంబయి ఫ్లయిట్ ఎక్కి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. తెలుగు నుంచి ఎన్ని ఆఫర్లొచ్చినా  తిరిగి రానంటూ అక్కడే మకాం వేసింది.సౌత్ ను వదిలేసి పోయాక ఇలియానాకు బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. ఏడాదికో రెండు సినిమాలు చేసినా అవేవీ పెద్దగా ఆడింది లేదు.. ఇలియానాకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందీ లేదు. ఆమె చాలా రోజులుగా ఫిజీకీ చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేస్తోంది. అతడితో విదేశాలన్నీ తిరుగుతూ ఖాళీ టైంను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఇల్లీ బేబీ గ్లామర్ ను మరోసారి అందరికీ గుర్తు చేస్తూ ఆమె బాయ్ ప్రెండ్ ఆండ్రూ ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బాత్ టబ్ లో రిలాక్స్ అవుతూ కాఫీ తాగుతున్న ఈ వయ్యారి ఫొటోను ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లోనే పోస్ట్ చేశాడు.

చాలారోజుల తరవాత ఇలియానా ఓ గ్లామరస్ స్టిల్ లో కనిపించడంతో ఆమె అభిమానులు హ్యాఫీగా ఫీలవుతున్నారు.  లాస్ట్ ఇయర్ అజయ్ దేవగన్ హీరోగా నటించిన బాద్షాహో సినిమాలో ఇలియానా హీరోగా నటించింది. తాజాగా మరోసారి అతడి పక్కనే రెయిడ్ సినిమా చేసింది. రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ లెక్కన కోరుకున్న బ్రేక్ కోసం మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే ఈ బాత్ టబ్ సుందరి.