Begin typing your search above and press return to search.

ఇలియానాపై భరోసా..!

By:  Tupaki Desk   |   11 Nov 2018 11:58 AM GMT
ఇలియానాపై భరోసా..!
X
రవితేజ - శ్రీనువైట్లల కాంబినేషన్‌ లో తెరకెక్కిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంకు పాజిటివ్‌ బజ్‌ ఉండటంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఇలియానా నటించడం వల్ల ఈ పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యిందని అంతా భావిస్తున్నారు. శ్రీనువైట్ల మరియు రవితేజలు ఫ్లాప్‌ లలో ఉన్నా కూడా ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే మంచి బిజినెస్‌ కూడా అయ్యిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ లో ఇలియానా లుక్‌ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పోస్టర్‌ లో ఇలియానా లావుగా అయ్యిందని టాక్‌ వచ్చిన నేపథ్యంలో కాస్త టెన్షన్‌ పడ్డ చిత్ర యూనిట్‌ సభ్యులు ఓవరాల్‌ గా ఇలియానా ఈ సినిమాకు పాజిటివ్‌ పాయింట్‌ అవుతుందని నమ్ముతున్నారు. తప్పకుండా ఈ చిత్రంలో ఇలియానా పాత్ర తప్పకుండా ఆకట్టుకుంటుందని, ఇలియానా వల్ల ఈ చిత్రం రేంజ్‌ పెరిగి పోతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశ పడుతున్నారు.

రవితేజ మరియు శ్రీనువైట్ల గత చిత్రాలు ఆకట్టుకోలేక పోయాయి. ఈ చిత్రంపైనే చాలా ఆశలు పెట్టుకున్నారు. శ్రీనువైట్ల చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్‌ పాత్ర చాలా కీలకం అవ్వడం వల్ల మొదట అను ఎమాన్యూల్‌ ను తీసుకుని - ఆమెను తొలగించి ఇలియానాను ఎంపిక చేయడం జరిగింది. ఇలియానాను ఎంపిక చేయడం తో సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కిందని చెప్పుకోవచ్చు. పాజిటివ్‌ బజ్‌ అయితే వచ్చిన ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.