ఆ ఫోటోను తీసేసిన ఇలియానా

Wed Jun 13 2018 07:00:01 GMT+0530 (IST)

తనను తాను బీచ్ బమ్ అని చెప్పుకునేందుకు గోవా బ్యూటీ ఇలియానా ఏ మాత్రం సంకోచించదు. అయినా గోవాలో పుట్టి పెరిగిన భామకు.. బీచ్ అంటే పడకపోతే విచిత్రం కానీ.. పిచ్చి ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఈ వయ్యారి భామ ప్రపంచం అంతా చుట్టేస్తూనే ఉంటుంది. షూటింగ్ గ్యాప్ వస్తే చాలు ఏదో ఒక కంట్రీకి చెక్కేస్తూ ఉంటుంది.విచిత్రం ఏంటంటే.. ఈ సుందరాంగి వెళ్లే ప్రాంతాల్లో అత్యధికం తీర ప్రాంతాలే అయి ఉంటాయి. రీసెంట్ గా ఫిజి వెళ్లిన ఇలియానా.. అక్కడి నుంచి కొన్ని ఫోటోలను తీసి నెట్ లో షేర్ చేస్తోంది. సముద్రం ఒడ్డున ఇసుకలో బెడ్ పై బోర్లా పొడుకుని పోజ్ ఇచ్చి మరీ.. స్మైల్ అని చెబుతున్న మాదిరిగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన ఫోటోను లేటెస్ట్ గా చూపించింది ఇల్లీ. గతంతో పోల్చితో కాసింత ఒళ్లు చేసినట్లు కనిపిస్తున్నా.. అమ్మడి అందాలు మాత్రం తెగ ఆకర్షించేస్తున్నాయి. బీచ్ లో బికినీల్లో తిరగడం.. ఆ అందాలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. అభిమానులను ఊరించడం ఈమెకు సర్వసాధారణమే.

అయితే.. ఇల్లీ హబ్బీ ఆండ్రూ నీబోన్ తీస్తున్న ఫోటోలు మరీ అట్రాక్టివ్ గా ఉంటున్నాయి. ఈ ఫోటోకు ముందు టూపీస్ బ్లాక్ బికినీలో వేసుకుని ఇలియానా సేద తీరుతున్నట్లుగా ఉన్న.. మరో సెక్సీ ఫోటో కూడా ఇలియానా పోస్ట్ చేసింది కానీ.. ఎందుకో 2 నిమిషాల్లోనే తీసేసింది. కానీ జనాలు ఇంతలోనే ఆ ఫోటోను డౌన్ లోడ్ చేసేసుకుని వైరల్ చేసిపారేశారు.