Begin typing your search above and press return to search.

ఇల్లీ కూడా సౌత్ బొడ్డు పై పంచ్ లు

By:  Tupaki Desk   |   20 Feb 2018 7:18 AM GMT
ఇల్లీ కూడా సౌత్ బొడ్డు పై పంచ్ లు
X
గోవా భామ ఇలియానా అందాలకు తెలుగు జనాలు ఏ రేంజ్ లో ఫ్లాట్ అయిపోయారో తెలిసిందే. గతంలోనే అయినా నడుం ఒంపులను ప్రదర్శించిన తీరు.. బక్కపలచని భామ అయినా చూపించిన ట్యాలెంటుకు ఆడియన్స్ బాగానే ఫిదా అయ్యారు. అయితే.. ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్ లో అడపాదడపా మెరుస్తోంది.

చివరగా ఆరేళ్ల క్రితం దేవుడు చేసిన మనుషులు తర్వాత ఇల్లీ బేబీ మళ్లీ తెలుగులో నటించలేదు. కానీ గతంలో ఓ సారి.. ఇప్పుడు మళ్లీ దక్షిణాది ఫిలిం మేకర్స్ పై గట్టి పంచ్ లనే పేల్చింది. సౌత్ సినిమాల్లో అందాల ప్రదర్శనే ముఖ్యం అంటూ తాప్సీ పన్ను కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇల్లీ బేబీ ఇందుకు దగ్గరగా కాదు.. ఇలాంటి కామెంట్స్ నే చేసింది. తన మొదటి సినిమా దేవదాసులో.. మొదటి షాట్ చిత్రీకరించే సమయంలోనే.. బొడ్డుపై శంఖం వేశారట. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే.. దర్శకుడు(వైవీఎస్ చౌదరి) ఇలా చేయడం చాలా అందంగా ఉంటుంది అని చెప్పాడట. నీకు చాలా అందమైన నడుము ఉంది.. ఇలా చేస్తే గుర్తింపు వస్తుంది అన్నాడట.

అలా ఎందుకు చేయాలో తనకు ఇప్పటికీ అర్ధం కాలేదన్న ఇలియానా.. ఇప్పటికీ బొడ్డు విషయంలో దక్షిణాది సినిమాలు ఇదే తరహాగా ఉన్నాయని చెబుతోంది. అందం యాంగిల్ లో తప్ప సౌత్ సినిమాల్లో హీరోయిన్స్ కు గుర్తింపు ఉండదని చెప్పిన ఆమె.. నార్త్ లో మాత్రం తనకు అలాంటి సిట్యుయేషన్ ఇప్పటివరకూ ఎదురుకాలేదని తెలిపింది.