మెంటల్ ప్రాబ్లెమ్స్ తెచ్చుకున్న ఇల్లీ

Mon Mar 19 2018 09:39:40 GMT+0530 (IST)

ఇది పోటీ ప్రపంచం.. ప్రతీ వారికి ప్రతీ అంశంలోనూ పోటీ తప్పదు. గ్లామర్ ఫీల్డ్ లో కూడా సేమ్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. హీరోయిన్లకు అయితే ఇంకా టఫ్ టైమ్స్ నడుస్తుంటాయి. వారానికో హీరోయిన్ వచ్చేస్తుందంటూ ఓ క్రేజీ బ్యూటీ కామెంట్ చేసిన సంగతి గుర్తుంచుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో రేసులో నిలిచేందుకు హీరోయిన్స్ చాలా కష్టపడాల్సి వస్తోంది.అదే విషయాన్ని గోవా బ్యూటీ ఇలియానా కూడా చెప్పుకొచ్చింది. మామూలుగానే బక్కపలచగా ఉండే ఈ భామ.. హిందీ సినిమాల్లోకి వెళ్లాక మరీ చిక్కిపోయింది. ఆ ఫిగర్ ను మెయింటెయిన్ చేయడానికి నానా కష్టాలు పడింది.. పడుతోంది కూడా. పోటీ మరీ విపరీతంగా ఉండడంతో.. ఎప్పటికప్పుడు లైఫ్ అంతా పరీక్షలే అన్నట్లుగా ఉంటుందట. ప్రతీ సినిమాను ఓ కఠిన పరీక్ష మాదిరిగా ఎదుర్కున్నానని చెబుతోంది ఇల్లీ బేబీ. ఇండస్ట్రీలో నిలబడేందుకు తన ఫిజిక్ ని మెయింటెయిన్ చేయడంతో పాటు.. పోటీ ఫీలింగ్స్ కారణంగా మెంటల్ ఫిట్నెస్ కి కూడా సమస్యలు వచ్చాయట.

ఫిజిక్ గురించిన ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్.. అందంగా కనపడడం లేదనే భావన.. ఇవన్నీ మెంటల్ ప్రాబ్లెమ్స్ కి కారణంగా చెబుతోంది ఇలియానా. హిందీలో ఈ భామకు మంచి హిట్స్ ఉన్నా.. చేతినిండా అవకాశాలు ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఇప్పటికీ లేదు. అవకాశం ఇవ్వాలే కానీ.. ఎలాంటి రిస్కీ క్యారెక్టర్లకు అయినా రెడీ అంటోంది ఇల్లీ.