షాకింగ్: ఇలియానా తల్లి కాబోతోందా!?

Tue Apr 17 2018 16:13:39 GMT+0530 (IST)

టాలీవుడ్ కి టాటా చెప్పి... బాలీవుడ్ కి చెక్కేసిన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు అక్కడ కూడా అవకాశాలు రాక.. బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూ యమా బిజీగా ఉంది. రోజుకోసారి ఆయనగారి ముచ్ఛట్లు చెప్పే ఇలియానా... కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. అయితే ఇప్పుడు రెయిడ్ సినిమా ప్రమోషన్లకు వచ్చిన ఆమె ప్రవర్తన అనేక అనుమానాలకు తావిస్తోంది.ఎప్పుడూ ఫిట్ గా అందాల సైజులు మొత్తం కనిపించేలా బట్టలు వేసుకునే ఇలియానా... రెయిడ్ సినిమా ప్రమోషన్లకు వచ్చినప్పుడు మాత్రం లూజ్ డ్రెస్సు వేసుకుని వచ్చింది. అంతేకాకుండా తన కడుపు కనిపించకుండా బ్యాగు అడ్డం పెట్టుకోవడం ఫోటోల్లో స్పష్టంగా పడింది. అంతేకాకుండా బక్క పిల్ల కడుపు కాస్త పైకి కనిపించడంతో ఇలియానా ఇప్పుడు తల్లి కాబోతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె చాలా రోజుల నుంచి బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో సహజీవనం చేస్తోంది. చాలా సార్లు బాయ్ ఫ్రెండ్ ని భర్తగా పిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది కూడా. మీడియా ఈ వ్యవహరం గురించి ప్రశ్నిస్తే మాత్రం అదంతా పర్సనల్ మ్యాటర్ అంటూ పెద్ద క్లాస్ పీకేసింది.

అంతేకాకుండా ఆండ్రూ నీబోన్ కూడా ఇలియానా బాత్ టబ్బులో పడుకుని కాఫీ తాగుతూ సేద తీరుతున్న ఫోటోని తీసి షేర్ చేశాడు. ఇలియానా ఒంటరిగా ఎంజాయ్ చేస్తోంది... నిజానికి ఆమెకి తోడు ఉందిలే...అంటూ ఓ ట్వీస్టుతో కూడిన కామెంట్ కూడా పెట్టాడు. ఆ తోడు ఆమె కడుపులో బిడ్డే అనుకుంటున్నారు ఆమె ఫాలోవర్స్. ఇంతకీ ఇలియానాకి పెళ్లయ్యిందా... పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా? ఏమో అవన్నీ ఆమె పర్సనల్స్! అడిగితే మాత్రం చెబుతుందా ఏంటి..!