Begin typing your search above and press return to search.

రోడ్ సైడ్ కూరగాయలు కొంటున్న బ్యూటీ

By:  Tupaki Desk   |   19 Oct 2018 9:31 AM GMT
రోడ్ సైడ్ కూరగాయలు కొంటున్న బ్యూటీ
X
ఒక హీరోయిన్ ఎక్కడైనా రైతు బజార్ కో లేదా రోడ్డు పక్కనున్న కూరగాయల దుకాణానికో వెళ్ళి వంకాయలు బెండకాయలు కొంటుందా? దాదాపుగా ఇలాంటివి జరగవు. కానీ గోవా బ్యూటీ ఇలియానా మాత్రం రీసెంట్ గా ముంబైలోని బాంద్రా ఏరియాలో ఒక రోడ్ సైడ్ ఉన్న కూరగాయల కొట్టుకు వెళ్లి అందరిలాగానే కూరగాయలు కొనుక్కుంది.

పుచ్చులు లేకుండా ముదురువి కాకుండా అన్నీ చెక్ చేసుకుని కొనుక్కుందట. సాధారణ మహిళల మాదిరే బేరం ఆడి.. ఒక బుట్టలో ఆ కూరగాయలు వేసుకుంది. ఆ కూరగాయల షాప్ వారికి ఇదొక సర్ ప్రైజ్. ఏకంగా ఒక హీరోయిన్ తమ షాపుకు వచ్చి కూరగాయలు కొనుక్కుంటే అంతకంటే ఇంకేం కావాలి? జిమ్ లో కసరత్తులు చేసి ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో ఇలా కూరగాయల షాపింగ్ చేసినట్టుంది.. ఎందుకంటే జిమ్ కు వెళ్ళే సమయంలో ధరించే దుస్తులలో కనిపించింది.

ఏదేమైనా ఆండ్రూ నీబోన్ లక్కీనే. ఇలా పుచ్చుల్లేని కూరగాయలు వెతికి .. ఆపై బేరలాడి కొనే హీరోయిన్ ఎంతమందికి దొరుకుతుంది. ఇంతకీ ఆ కూరగాయలతో ఏం వండి పెట్టిందో? ఆ విషయం బయటకు రాలేదు గానీ కూరగాయలు కొనే వీడియో మాత్రం బయటకు వచ్చింది. మీరూ ఆ వీడియో ను ఒక సారి చూడండి.