Begin typing your search above and press return to search.

పర్మినెంటుగా ఇలియానా సర్దుకోవాలేమో

By:  Tupaki Desk   |   4 Oct 2015 5:30 PM GMT
పర్మినెంటుగా ఇలియానా సర్దుకోవాలేమో
X
గోవా బ్యూటీ ఇలియానాకు ఇప్ప‌టికే అవ‌కాశాలు లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతోంది. కోరి వెళ్లిన బాలీవుడ్ పొమ్మంది. కాద‌ని వెళ్లిన టాలీవుడ్ ఇప్పుడు మాకు అవ‌స‌రం లేదంటోంది. ఇలా రెండు ప‌రిశ్ర‌మ‌లు హ్యాండిచ్చాయి. ఇటు ఇటూ కాకుండా స‌న్న‌జాజి సోయ‌గం మ‌ధ్య‌లో న‌లిగిపోతుంది. స‌రైన టైమ్‌ లో అమ్మ‌డిని వెతుక్కుంటూ ఓ గొప్ప అవ‌కాశం వ‌చ్చి ప‌డింది అని అందరూ అంటున్నారు.

ఇటీవ‌లే చాకీ చాన్ తాజా చిత్రం కుంగ్ ఫూ యోగా ప్రారంభ‌మైంది. భార‌త్- చైనాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌ట‌కే బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ ఓ పాత్ర‌కు ఎంపిక‌య్యాడు. తాజాగా జాకీ స‌ర‌స‌న ఇలియాను తీసుకోవడానికి సన్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

కుంగ్‌ ఫూ యోగాలో సోనూ సూద్ పాత్ర‌కు అమీర్ ఖాన్ ను... ఇలియానా పాత్ర‌కు క‌త్రినా కైఫ్ ను తీసుకోవాల‌నుకున్నారు. అయితే వాళ్ల‌కు డేట్లు స‌ర్దుబాటు కాలేదు. ఈ నేప‌థ్యంలో సోనూ సూద్ ఎంపిక చేసుకున్నారు. కాగా గ‌తంలో జాకీ చాన్ స‌ర‌స‌న ''ది మిత్‌'' అనే సినిమాలో బాలీవుడ్ నాయిక మ‌ల్లికా షెరావ‌త్ న‌టించింది. అందుకే ఇప్పుడు ఇలియానా అభిమానులకు భయం వేస్తోంది.

తొలిసారి జాకీ చాన్ స‌ర‌స‌న అవకాశం అందుకోవ‌డంతో మ‌ల్లిక జాకీ స‌ర‌స‌న న‌టించిన తొలి భారతీయురాలు అయింది. ఇప్పుడు ఇలియానా ఆ అవ‌కాశం చేజిక్కించుకుంటే త‌ర్వాతి స్థానం ఆమెదే అవుతుంది. కాని అప్పట్లో ఆ సినిమా చేశాక మల్లికా శెరావత్‌ కెరియర్‌ ఇక ఢమాల్‌ అనేసింది. ఏదో హాలీవుడ్‌ లో రెడ్‌ కార్పెట్‌ మీద అమ్మడిని నడిపిస్తున్నారు కాని.. ఎవ్వరూ పిలిచి ఛాన్సులు మాత్రం ఇవ్వట్లేదు. ఇలియానా కూడా ఆ సెంటిమెంట్‌ ప్రకారం జాకీ ఛాన్‌ సినిమా పూర్తవ్వగానే ఇక పర్మినెంటుగా బాయ్‌ ఫ్రెండ్‌ ఆండ్రూ తో కలసి ఆస్ర్టేలియాకు బ్యాగ్ లు సర్దుకోవాలేమో.