Begin typing your search above and press return to search.

ఇళయరాజాను ఇలా ఎప్పుడైనా చూశారా..

By:  Tupaki Desk   |   1 May 2016 1:30 PM GMT
ఇళయరాజాను ఇలా ఎప్పుడైనా చూశారా..
X
ఇళయరాజా అనగానే తెల్లటి పంచె.. పైన జుబ్బాతో చాలా సింపుల్ గా ఉండే ఓ అవతారం కళ్లముందు మెదులుతుంది. గత నాలుగు దశాబ్దాలుగా రాజా సార్ ను అందరూ అలాగే చూస్తున్నారు. సందర్భం ఏదైనా సరే.. ఆయన ఆ అవతారం మార్చలేదు. ఒకే తరహా డ్రెస్సింగ్ తో కంటిన్యూ అయిపోతున్నారు. ఐతే ఇన్నేళ్లలో ఎప్పుడూ అవతారం మార్చని ఇసై జ్నాని.. ఎట్టకేలకు పట్టు విడిచారు. ఓ మ్యూజికల్ కన్సర్ట్ కోసం ఆయన సూటేసుకుని ఓ ఫొటో షూట్ చేశారు. ఈ అవతారంలో ఆయన్ని చూడటం భలే చిత్రంగా అనిపించింది అందిరికీ.

ఎప్పుడూ ప్యాంటైనా వేయని రాజా సార్.. ఒక్కసారికే సూటే వేయాల్సి వచ్చేసరికి తెగ ఇబ్బంది పడిపోయారు. ఆ ఇబ్బంది ఆయనిచ్చిన పోజుల్లో స్పష్టంగా తెలిసిపోయింది. నాకీ సూట్.. సూట్ కాదు బాబోయ్ అన్న ఫీలింగ్ ఆయన ముఖంలో.. బాడీ లాంగ్వేజ్ లో స్పష్టంగా కనిపించింది. ఐతే ఇళయరాజా అలా ఇబ్బంది పడ్డప్పటికీ.. అభిమానులకు మాత్రం ఆయన్నిలా చూడటం సంతోషాన్నిచ్చింది. 72 ఏళ్ల వయసులోనూ అలుపు లేకుండా తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇళయరాజా. ఇటీవలే ఆయన 1000వ సినిమా కూడా విడుదలైంది. ఇప్పుడు కూడా ఆయన చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులుండటం.. కమల్ హాసన్ సినిమాకు కూడా సంగీతాన్నందించబోతుండటం విశేషం.