Begin typing your search above and press return to search.

కొడుకు కోసం లెజండ్ పాడిండు

By:  Tupaki Desk   |   17 Jan 2018 5:26 AM GMT
కొడుకు కోసం లెజండ్ పాడిండు
X
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఏ సినిమా చేసినా అందులో ఎదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. తీసింది తక్కువ బడ్జెట్ సినిమా అయినా భారీ బడ్జెట్ సినిమా అయినా ఖర్చుతో పాటు కంటెంట్ కూడా ఉండాలని అనుకుంటాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎదో ఒక విధంగా ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాడు. అయితే ఈ మధ్య ఈ రజినీకాంత్ అల్లుడు కొంచెం సీక్వెల్స్ తో కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫలితం గురించి ఆలోచించకుండా డేర్ చేస్తున్నాడు.

గతంలో ధనుష్ చేసిన మారి సూపర్ హిట్ అయ్యింది. గ్యాంగ్ స్టార్ కామెడీ తరహాలో వచ్చిన ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. మళ్లీ అదే దర్శకుడు బాలాజీ మోహన్ సీక్వెల్ కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇకపోతే సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు. అయితే యువన్ తండ్రి.. లెజండరీ మెస్ట్రో ఇళయరాజా ఈ సినిమాలో ఒక పాట పాడబోతున్నారు. రీసెంట్ గా రికార్డింగ్ కూడా పూర్తయ్యింది. తనయుడి కంపోజింగ్ లో లెజండరీ సంగీత దర్శకుడు పడటం చాలా స్పెషల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఫిదా బ్యూటీ సాయి పల్లవి సినిమాలో ధనుష్ సరసన అల్లరి చేయడానికి సిద్ధమైంది. సినిమాను భారీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో కూడా హై లెవెల్లో లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉంటాయని తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరలో టీజర్ ని రిలీజ్ చేయాలని దర్శకుడు బాలాజీ అనుకుంటున్నాడు. గతంలో ఈ దర్శకుడు సిద్దార్థ్ తో లవ్ ఫెయిల్యూర్ సినిమాను చేశాడు.